టి-కాంగ్రెస్ రాజీనామాలకి ప‌రిష్కారం..?

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎమ్.పిలు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరింపచేయకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు చేసిన రాజీనామాలు ఉపసంహరించుకుంటే మిగిలిన రాజకీయ పార్టీలు దానిని తమ ప్రయోజనానికి వాడుకోవచ్చని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయపడుతున్నట్ల కధనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు టిడిపి, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ పక్షాలకు చెందిన నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అవన్ని స్పీకర్ల వద్ద పెండింగులో ఉన్నాయి. పార్టీ పరంగా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చి ఉపసంహరింపచేస్తే, మిగిలిన పార్టీలు ఉపసంహరించుకోకపోతే , ఈ నేతల రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని పార్టీ నాయకత్వం గుర్తించింది.అంతేకాక ఆ నేతల భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ నేతలపై ఒత్తిడి తేరాదన్నది ఎ.ఐ.సి.సి అభిప్రాయంగా ఉంది.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకుంటే ప్రజల దృష్టిలో చులకన అవుతారని అందువల్ల దీనికి వేరే పరిష్కారమే సరైనదని భావిస్తున్నారు. స్పీకర్లు ఇవన్ని ఒత్తిడితో జరిగాయని ప్రకటించి, వాటన్నిటిని తిరస్కరించవచ్చు. అలా చేస్తే అన్ని పార్టీల రాజీనామాలు ఒకేసారి తోసిపుచ్చవచ్చు. ఆ తర్వాత కూడా ఎవరైనా రాజీనామాలు చేస్తే అప్పుడు చేయగలిగింది లేదు. ఇప్పటికైతే ఇదే పరిష్కారమార్గమని పార్టీ నాయకత్వంఅభిప్రాయపడుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!