క‌రుణానిధికి రెస్ట్ ఇవ్వడం లేదు..


తమిళనాడులోని డి.ఎమ్.కె.రాజకీయ పార్టీలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులో కూడా ఆయన పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు మోయక తప్పడం లేదు. నిజానికి నడవలేని స్థితిలో వీల్ ఛైర్ లోనే తిరగవలసి వస్తున్న కరుణానిధి వారసుడిని ఎంపిక చేయడంలో ఎదురవుతున్న సమస్యల రీత్యా తిరిగి ఆయననే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించు కున్నారు. కోయంబత్తూరు లో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇద్దరు కుమారుడు కేంద్ర మంత్రి అళగిరి, రెండో కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ల మధ్య చోటు చేసుకున్న విబేధాల వల్ల ఈ తలనొప్పి ఏర్పడింది. స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టాలని విశ్వయత్నం చేసినా ఆళగిరి అడ్డుకున్నారు. పార్టీ కాడర్ కు నేరుగా స్టాలిన్ అనుకూలంగా అబిప్రాయాలు వ్యక్తం చేయవద్దని పిలుపు ఇచ్చారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాలలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ లోనే కొనసాగాలని కూడా నిశ్చయించారు. రాష్ట్రంలో ఓడిపోయిన నేపధ్యంలో కేంద్రంలో కూడా అదికారం లేకపోతే ఎదురయ్యే చిక్కులను దృష్టిలో ఉంచుకుని యుపిఎకి మద్దతు ఇస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!