అక్షయ్ బ‌న్‌గ‌యా హాలీవుడ్ హీరో..


ప్రముఖ హిందీ నటుడు అక్షయకుమార్ ఆంగ్లంలో సినిమా తీసి హాలీవుడ్ లోవిడుదల చేయబోతున్న తొలి బాలీవుడ్ నటుడుగా రికార్డుకెక్కుతున్నారు. ఇండో – కెనడా వెంచర్ కింద అక్షయ్ కుమార్ఈ సినిమాను అంతర్జాతీయ నటులు రాబ్ లోవె, రస్సెల్‌ పీటర్స్, కమిల్లా బెల్లె, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటులతో నిర్మించారు.అక్షయకుమార్ ఒక ప్రత్యేక పాత్రను ఇందులో పోషించారు. విదేశాలతోపాటు ఇండియాలో కూడా ఈ సినిమా విజయవంతం అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంగ్లీష్ లో ఈ సినిమా టైటిల్ బ్రేక్ ఎవే అయితే, ఇండియా స్పీడ్ సింగ్ అని పేరు పెట్టారు.సెప్టెంబరు ముప్పైన హాలీవుడ్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మొత్తం మూడువేల ఐదువందల ప్రింట్లు ఇందుకోసం తయారవుతున్నాయి.హాలీవుడ్ లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబింప చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఈ సందర్భంగా అక్షయకుమార్ అంటున్నారు. విదేశాలలో స్థిరపడ్డ భారతీయులకు సంబందించిన కధ తీసిన ఈ సినిమాను యువత నుంచి వృద్దులవరకు ఆదరిస్తారని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. కాగా కెనడా ప్రభుత్వం సహకారంతో ఆ దేశంలో అందమైన టొరెంటో, వాంకోవర్ తదితర నగరాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. సెప్టెంబర్ పది న టొరెంటో లో జరిగే అంతర్జాతీయ సినిమా ప్రదర్శనలో కూడా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!