వివాదంలో జైరాం ర‌మేష్‌


మేధావులనుకునేవారు కొందరు తాము ఏమి చేసినా చెల్లుతుందనుకుని వివాదంలో చిక్కుకుంటారు. కేంద్ర మంత్రి వర్గంలో జైరామ్ రమేష్ ఒకరకంగా చెప్పాలంటే మేధావే. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఆ రకంగానే గుర్తించి ఆంద్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చింది.ఆయన కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లోని బికనూర్ సందర్శించారు అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొంటే నిర్వహకులు స్వాతంత్ర్యానికి చిహ్నమైన నూలు దండను ఆయనకు వేసి స్వాగతం చెప్పారు. అనాలోచితంగా చేశారో, లేక అదేమంత పెద్ద ఇష్యూకాదనుకున్నారో కాని, ఆయన ఆ నూలు దండను తీసి టేబుల్ ప పెట్టారు కాసేటికి దానిని తన బూటు తుచుకోవడానికి వాడారు. అది చూసిన నిర్వాహకులు ఒక్కసారే నివ్వెర పోయారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
కూడా అక్కడ ఉన్నారు. దీనిపై వారు ఏమి మాట్లాడలేదు కాని, రాష్ట్ర బిజెపి మాత్రం దీనిని తీవ్రంగా విమర్శించింది.గాందీజీ నూలు వడికారు.గాంధీ ఖాదీని ప్రోత్సహించారు. అలాంటి నూలు దండను ఆయన సమర్పిస్తే, దానిని బూటు తుడవడానికి వాడతారా అంటూ బిజెపి మండిపడింది. వెంటనే మంత్రి జైరామ్ రమేష్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండు చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!