ఈ బంద్‌ల‌కి బంద్ ఎప్పుడు..?



మొన్న తెలంగాణ జెఏసి బంద్‌, నిన్న స‌మైఖ్యాంధ్ర జేఏసీ బంద్‌.. నేడు విద్యార్థి సంఘాల బంద్‌. అయితే ఈ బందు కేవ‌లం విద్యా సంస్థ‌ల‌కి మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ ఒక్క‌రోజు బంద్ కార‌ణంగా విద్యార్థులు ఎంత‌టి ఇబ్బందులు ప‌డ‌తారో అన్న‌ది ఆలోచించాలి. ఇలా వారానికో బంద్ వ‌స్తుంటే విద్యా సంవ‌త్స‌రంలో ముగించాల్సిన సిల‌బ‌స్ పెండిగ్ ప‌డిపోతుంది.. దాంతో విద్యార్థులు చ‌దువు కోవ‌డానికి, నేర్చుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దు.. కానీ ప‌రీక్ష‌ల్లో మాత్రం సిల‌బ‌స్ ని అనుస‌రిస్తూ ప్ర‌శ్నాప‌త్రాలు వెలువ‌రుస్తారు. ఆ ప్ర‌శ్నా ప‌త్రాల్లో ఉన్న వాటికి జ‌వాబులు తెలియ‌క విద్యార్థులు ఎంత బాధ‌ప‌డ‌తారో గ్ర‌హించాలు..  సిల‌బ‌స్ కంప్లీట్ కాకుండానే ప‌రీక్ష హాల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులు ఎలా ప‌రీక్ష రాస్తారు..? ఒక్క రోజు బంద్ కార‌ణంగా దాదాపు 1000 కోట్ల రూపాయ‌లు న‌ష్టం వ‌స్తుంద‌ని ఒక అధ్య‌య‌నం లో తేలిది.. ఇక విద్యాసంస్థ‌లు బంద్ కార‌ణంగా న‌ష్టం రూపాయ‌ల‌లో క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ కోట్ల మంది విద్యార్థుల మ‌నో వికాసానికి మాత్రం తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌న్న‌ది నిర్వివాదాంశం. ఇప్ప‌టికైనా ఇలా అయిన‌దానికి, కానిదానికి బంద్‌ల‌కి పిలుపునిచ్చే నాయ‌కులు బంద్‌ల కార‌ణంగా ఎంత న‌ష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకుని ఈ బంద్‌ల‌కి బంద్ పెట్టాల‌ని అంద‌రూ భావిస్తున్నారు. రేప‌టి త‌రం భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా విరాజిల్ల‌డానికి నేటి త‌రం గ‌ట్టి పునాదులు ఏర్పాటు చేయాలి గానీ.. పునాదుల‌తో స‌హా పెకిలించివేసే చ‌ర్య‌లు మానుకోవాలి.
Ch. Santoshkrishna
santoshkrishnach@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!