రంగంలోకి మ‌రో ప‌త్రిక‌, ఛానెల్‌..?


ఇటీవలికాలంలో మీడియాపై అనేకమంది రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు ఆసక్తి పెరుగుతోంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తొలుత ఈ రంగంలోకి రావడానికి వెనుకాడారు కాని, కొద్దికాలం క్రితమే ఆయన కుమారుడు లోకేష్ వారి సమీప బంధువు నుంచి ఎన్.స్టూడియోని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు టి.ఛానల్, నమస్తే తెలంగాణ పత్రికను ఏర్పాటు చేసుకున్నారు.త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా టీవీ ఛానల్ తీసుకురావాలని భావిస్తున్నారు. వీరు కాక మరికొందరు పారిశ్రామిక,వ్యాపారవేత్తలకు కూడా మీడియా రంగంలోకి రావాలని ఉంది.వీరందరిది ఒక ఎత్తు అయితే, కెసిఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి తాను కూడా ఒకపత్రికను, ఒక టీవీ ఛానల్ ను తెస్తున్నానని ప్రకటించారు.తెలంగాణ పేరుమీద వచ్చిన ఒక టీవీ ఛానల్ , పేపర్ కేవలం బ్లాక్ మెయిలింగ్ కే పరిమితమవుతున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.తెలంగాణ పేరుతో వందకోట్లు పోగుచేసుకుని తన కుటుంబం ఆస్తులుగా కూడగట్టుకున్నారని ఆయన అన్నారు.అందువల్ల జై తెలంగాణ జై అన్న పేరుతో పత్రిక, చానల్ ను ఆరంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.మీడియాలోకి వస్తేకాని అందులో కష్టాలు తెలియవు.ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వంద కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించే జగ్గారెడ్డి జాగ్రత్తగా మీడియాను నడపలేకపోతే చేతులు కాల్చుకోవలసి వస్తుంది సుమా! ఎవరి మీదో కోపంతో కాకుండా,వృత్తినైపుణ్యతతోనే నడపగలిగితేనే ఇవి నడుస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!