డ్రగ్ కేసులో వరుణ్ సందేశ్


మరో డ్రగ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో కొకైన్ తో ఫెడ్రిక్ అనే నైజీరియన్ డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గరున్న 50 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫెడ్రిక్ తో పాటు.. జూనియర్ ఆర్టిస్ట్ సిద్దార్థను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణలో కొన్ని కీలక విషయాలు సిద్దార్థ్ చెప్పినట్లు.. కథనాలు వస్తున్నాయి. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం ఫేం హీరో వరుణ్ సందేశ్ తో పాటు మరో హీరో.. నేను, డేంజర్ సినిమాల్లో నటించిన అభిషేక్ నిర్మాత రవి ఉప్పల కు ఇప్పటివరకు కొకైన్ అమ్మినట్లు సిద్దార్థ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని కథనాలు వస్తున్నాయి. అయితే వరుణ్ సందేశ్ తో పాటు వీళ్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. విచారించాకే వివరాలు బయటకువస్తాయని చెబుతున్నారు. కాగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ను డ్రగ్స్ రాకెట్ కుదిపేస్తోంది. ప్రముఖ హీరో హీరోయిన్లకు.. పేరుప్రఖ్యాతలున్న నిర్మాతలకు కూడా డ్రగ్స్ తో లింకులున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!