బాలకృష్ణకు గడువు తిరస్కరించిన సీబీఐ


అవినీతి నిర్మూల‌న‌కు న‌డుం బిగించి.. దేశాన్ని అవినీతి ర‌హిత దేశంగా తీర్చిదిద్ద‌డానికి కేంద్ర ప్ర‌భుత్వంతో కొట్లాట‌కి దిగ‌డ‌మే కాకుండా, ఏకంగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ని చేప‌ట్టి మాంచి ప‌బ్లిసిటీ సంపాదించిన గురువు బాబా రాం దేవ్‌. దేశాభ్యున్న‌తి కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న బాబా రాందేవ్ అనుచ‌రుడు బాల‌కృష్ణ మాత్రం న‌కిలీ స‌ర్టిఫికెట్ (అదే.. అవినీతి మార్గంలో) తో పాస్‌పోర్ట్ సంపాదించిన కేసులో ఇరుక్కుపోయాడు. ప్ర‌స్తుతం అజ్ఞాతంలో ఉన్న బాల‌కృష్ణ‌ని వెంట‌నే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సిబిఐ అధికారులు అదేశిం చారు. తాను హాజ‌రుకావ‌డానికి 20 రోజుల స‌మ‌యం కావాల‌ని ఓ సందేశాన్ని బాల‌కృష్ణ సిబిఐ అధికా రుల‌కి చేర‌వేశాడు. కానీ.. ఆయ‌న సందేశాన్ని నిర్వ్దందంగా తోసిపుచ్చి వెంట‌నే విచార‌ణ‌కి హాజ‌రు కావాల‌ని ఆదేశించ‌డంతో ఎక్క‌డో అజ్ఞాతంలో ఉన్న బాల‌కృష్ణ వెంట‌నే బ‌య‌టికి వ‌చ్చి సిబిఐ అధికారుల ఎదుట హాజ‌రు కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!