రాజీనామాలను తిస్కరించిన స్పీకర్

అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతనే తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించినట్లు మనోహర్ చెప్పారు. లండన్ వెళ్లిన నాదెండ్ల మనోహర్ ఆగస్టు మొదటివారంలో తిరిగి హైదరాబాద్ వస్తారు. శాసనసభ్యులను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ అందుకు భిన్నంగా రాజీనామాలను తిరస్కరించారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికే స్పీకర్ రాజీనామాలను తిరస్కరించినట్లు భావిస్తున్నారు. స్పీకర్ రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రేపు ఆదివారం సమావేశమవుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు కూడా రేపు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించు కుంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి