ప్ర‌భుత్వ భూముల్లో విలాసాలు..


కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం చిత్ర పరిశ్రమపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోకు, దర్శకుడు రాఘవేంద్ర రావుకు, అపోలో యాజమాన్యానికి ఎకరాల కొద్ది భూములు కేటాయించిందని వాటిపై తాము ఏమీ ప్రశ్నించడం లేదని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వారు కట్టించిన భవనాల కంటే వారికి ప్రభుత్వం కేటాయించిన తెలంగాణ భూములకే ఇప్పుడు ఎక్కువ ధర ఉందని అన్నారు. అయినా వాటిపై మేము ప్రశ్నించడం లేదన్నారు. సినీ ప్రముఖులు తమకు కేటాయించిన భూముల ప్రయోజనాన్ని దెబ్బ తీసి బార్లు, ఇతరత్రా వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉన్న ఆంధ్రా వారికంటే అడ్డగుట్టలో నివసించే వారే ఎక్కువ ఉన్నారని అన్నారు. హైదరాబాదులోని ఖరీదైన భూముల్లో భవనాలు కట్టుకుని నివసిస్తున్నారని, వాటిని పెట్టుబడులు అని ఎలా అంటారని ఆయన అన్నారు. తాము హైదరాబాదులో పెట్టుబడులు పెట్టామని సీమాంధ్ర ప్రముఖులు చేస్తున్న వాదనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!