వ‌రుణ్‌కి పాలిగ్రాఫ్ ప‌రీక్ష..?


తెలుగు యువ హీరో వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. డ్రగ్ రాకెట్‌లో వరుణ్ సందేశ్‌తో పాటు మరో యువ హీరో అభిషేక్, నిర్మాత ఉప్పలపాటి రవి చిక్కుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. డాక్టర్ నాగ సిద్ధార్థ, నైజీరియన్ ఫ్రెడ్రెరిక్‌ను 25 గ్రాముల కొకైన్‌తో పోలీసులు పట్టుకోవడంతో వారి పేర్లు బయటకు వచ్చాయి. తాను వరుణ్ సందేశ్‌కు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసు విచారణలో అంగీకరించిన సిద్ధార్థ ఆ తర్వాత మాట మార్చాడు. హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో గల తన ఇంటికి వరుణ్ నాలుగు సార్లు వచ్చినట్లు కూడా విచారణలో చెప్పాడు. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్‌కు తాను డ్రగ్స్ ఇవ్వలేదని చెప్పాడు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను వరుణ్ సందేశ్ కూడా ఖండించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!