అనిల్ మృతి.. అనుమానాస్పదం.


సంగీత దర్శకుడు అనిల్ మృతి అనుమానాస్పదంగా మారింది. ఆయ‌న‌ది హ‌త్యే అని తెలిసినా.. హ‌త్య ఎలా జ‌రిగింద‌న్నది ఇంకా తెలియ‌డంలేదు. తెలుగు చిత్రసీమ‌లో సంగీత ద‌ర్శకుడిగా ఇప్పుడిప్పుడే కెరీర్‌ని పుంజుకుంటున్న త‌రుణంలో అనిల్ మ‌ర‌ణం అత‌ని కుటుంబ స‌భ్యుల్లోనే కాకుండా చిత్రసీమ‌లోని ఆయ‌న మిత్రుల్లో కూడా తీవ్ర విచారం క‌న‌బ‌డుతోంది. అనిల్ మ‌ర‌ణం వెనుక అనిల్‌తో నిశ్చితార్థం జ‌రిగిన శాలిని, ఆమె త‌ల్లి హ‌స్తం ఉంద‌ని అనిల్ కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు కూడా ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. అయితే అనిల్ డెడ్‌బాడీని ఉస్మానియా, గాంధీ హాస్పిట‌ల్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రెండు హాస్పిట‌ల్‌లో నుంచి వ‌చ్చిన రిపోర్టులు విరుద్దంగా ఉండ‌డంతో అనిల్ మృతికి కార‌ణం ఏమై ఉంటుందా అన్నది తెలుసుకోవ‌డం పోలీసుల‌కి త‌ల‌నొప్పిగా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన అనుమానితురాలు షాలిని ఇంకా పోలీసుల‌కి అందుబాటులో రాలేదు. ఆమె ఈ హ‌త్య జ‌రిగిన‌ప్పటినుండి అజ్ఞాతంలో ఉండిపోయింది.. మ‌రి.. అనిల్ మృతికి గ‌ల కార‌ణాల‌ని పోలీసులు ఎప్పటికి ఛేధిస్తారో.. అన్నది చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!