సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే తొలిసారిగా..




డాక్ట‌ర్‌. డి. రామానాయుడు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం చేయా ల్సిన ప‌నిలేదు. అధిక చిత్రాల‌ని నిర్మించిన ఏకైక వ్య‌క్తిగా గిన్నిస్ రికార్డు సాధించిన రామానాయుడు గారు త‌న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ద్వారా ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీస్‌ని తెర‌కెక్కించారు. తాజాగా ఆయ‌న వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ముగ్గురు సినిమా నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మ‌లేషియాలో, కారంచేడులో చిత్రం షూటింగ్ జ‌రిగింద‌ని రామానాయుడు చెప్పారు. అయితే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో తొలిసారిగా వారు నిర్మించే మూవీకి అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డా. డి. రామానాయుడు ముగ్గురుద మూవీ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ని నేడు ప్రారంభించారు. ముగ్గురుకి సంబంధించిన సినిమా విశేషాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ముగ్గురు ద మూవీ డాట్ కామ్‌లో చూడొచ్చ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంక‌లో హీరోయిన్లు సంజ‌న‌, శ్ర‌ద్దా దాస్‌, ద‌ర్శ‌కుడు వి.ఎన్‌. ఆదిత్య‌, సంగీత ద‌ర్శ‌కుడు కోటి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ఎక్స్‌ప‌ర్ట్ వెబ్ వ‌ర్క్స్ సిఇఓ సోమేశ్వ‌ర్ రావులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!