అన్ని వార్తలు ఒకలా ఉండవు
indian News,India Latest News | News, Hollywood news, Bollywood news, political satires,Movie News, News Portal, Music, Movie News, Hollywood,
IT news portal providing latest Information Technology news
ఈనాడు, సాక్షిల కోల్డ్ వార్..!
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు, సాక్షి అధిపతి జగన్మోహన్ రెడ్డికి, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావులకు మధ్య నిత్య యుద్దం రక్తి కట్టిస్తోంది. జగన్ ఆస్తులపై కోర్టు విచారణకు ఆదేశాలు ఇవ్వగానే, ఈనాడులో జగన్ ఆస్తుల కేసు అని రాయకుండా అక్రమ ఆస్తుల కేసు అని పెట్టి కధనాలు ఇచ్చింది. ఇక సాక్షి కూడా రామోజికి సంబంధించి చిన్న వివాదం దొరికినా పెద్ద ఎత్తున రాస్తూ సందడిచేస్తోంది. ఇద్దరి మధ్య సాగుతున్న ఈ యుధ్దం ఎప్పుడు ఏ రూపం దాల్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రామోజీరావుకు వ్యతిరేకంగా సాక్షి ఒక కధనాన్ని ఇస్తూ మార్గదర్శి కేసు తేలకుండానే ఆయన ఆస్తులు అమ్మకానికి పెట్టారంటూ ఒక పెద్ద కధనాన్ని ఇచ్చింది. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు మొదలైంది. అప్పట్లో ఈ కేసుపై రకరకాల కధనాలు రావడం, ఆదాయపన్ను శాఖ కేసు పెట్టడం, సిఐడి కూడా దీనిపై విచారణ చేయడం వంటివన్ని జరిగాయి. అకస్మాత్తుగా రాజశేఖరరెడ్డి మరణంతో ఆ కేసులన్నీ వెనుకబడ్డాయి. ఆ తర్వాత జగన్ వంతు వచ్చింది. జగన్ అక్రమ ఆస్తులు సంపాదించారంటూ , వై.ఎస్.జమానాలో జరిగిన ఆయా లావాదేవీలపై ఈనాడు పలుమార్లు కధనాలు వచ్చాయి. ఇది ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లి సిబిఐ విచారణ దశకు చేరింది.ఈ తరుణంలో సాక్షి ఒక కధనాన్ని ఇస్తూ రామోజీ మూడు కంపెనీలను బోగస్ చిరునామాలతో రిజిస్టర్ చేశారని ఆరోపించింది. సాక్షి లో పెట్టుబడులు పెట్టినవారిలో కొన్ని అడ్రస్ లు బోగస్ వని గతంలో ఈనాడు రాస్తే, ఇప్పుడు అదే ఆరోపణ రామోజీరావు ఎదుర్కోవలసి వచ్చింది.రామోజీ తనకున్న టివీ చానళ్లలో 11 చానళ్లను సోని సంస్థకు విక్రయించబోతున్నదన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో సాక్షిలో ఈ కధనాలు రావడం విశేషం.రామోజీ ఈటీవి తెలుగు, ఈటివి-2, చానళ్లను ఉషోదయ టెలివిజన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు, తెలుగేతర ప్రాంతీయ భాష చానళ్లు ఈటివి కన్నడ, ఒరియా, బంగ్లా, మరాఠి, గుజరాత్ చానళ్ల నిర్వహణకు ప్రిజమ్ , హింది, ఉర్దూ, చానళ్లను పనోరమ కు మళ్లించారని రాశారు.ప్రిజమ్, పనోరమ,టీవీ సంస్థల నమోదిత కార్యాలయాలు పూర్తిగా బోగస్ చిరునామాలలో ఉ్నాయని సాక్షి అభియోగం మోపుతోంది.కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు పెట్టిన పిటిషన్ లో ఈ బోగస్ చిరునామాలున్నాయని రాసిన సాక్షి ఆ చిరునామాలను ప్రస్తావించలేదు.
దీనికి ఈనాడు సమాధానం ఇస్తుందా? లేక పట్టించుకోకుండా వదిలివేస్తుందా అన్నది చూడాలి.
బర్నింగ్ కామెంట్రీ - 5 .................................................. నగ్న పాచికల జూదం!! వయసువెన్నెల్లో తడిసి మెరిసిన సింగారం కాసుల కోసం `షార్ట్'కట్స్ లో వెండితెరపై ఆరేసిన అందం చూసేవాళ్ల కంటిమీద గ్యారెంటీగా కునుకు దూరం! ఇది నేడు హిట్ ల కోసం ఆడే నగ్న పాచికల జూదం!! ...
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణ, కేసు తదుపరి పరిణామాల కారణంగా ఒక వేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఏం జరుగుతుందన్న చర్చ ఊపెక్కింది. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, అతని రాజకీయ జీవితం కుప్పకూలినట్టే అని ఒక పక్క కాంగ్రెస్, టిడిపీలోని పెద్దలు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన `చిన్నోళ్లు’ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధభావాల నేపథ్యంలో జగన్ జైలుకెళ్తే ఏం జరుగుతుందన్న ఈ రచయిత కొంతమంది రాజకీయ విశ్లేషకులను కదిలిస్తే కొన్ని ఆ...
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో అపార నిధినిక్షేపాలు దొరకడంతో ఇప్పుడు అందరి కళ్లు అటే పడ్డాయి. తరగని సంపద ఉన్నదని సంతృప్తి చెందుతున్నా మేకానీ, అదంతా ఎలా వచ్చిందో ఆలోచించడంలేదు. అనేక యుద్ధాలు, రక్తపాతాలు, పసిగుడ్డు తల్లుల శాపనార్ధాల ఫలితంగా కూడా సంపద ఈ నేలమాళిగలో పోగయింది. ఈ మాట గట్టిగా అంటే, నేనేదో హేతువాదిననో, దేవుడికి తీరని అన్యాయం చేస్తున్నాననో అనుకోవచ్చు. అలాంటి ఉద్దేశాలు, ఇమేజ్ లు నాకు లేవు. ఉన్నదల్లా, వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావలన్న తపనమాత్రమే. ఇప్పటికే రెండు పార్ట్స్ చదివే ఉంటారు. ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి