250 కోట్ల డాల‌ర్లు.. మూలుగుతున్నాయి..


ఇప్పటి వరకూ కొనసాగు తున్న ఊహాగానాలకు తెరపడింది..! స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం మూలు గుతోందని ఆ దేశపు జాతీయ బ్యాంకు తెలిపింది. గత ఏడాది చివరి నాటికి స్విస్‌ బ్యాంకుల్లో 250 కోట్ల డాలర్లుకు పైగా భార తీయుల సొమ్ము ఉందని స్విస్‌ జాతీయ బ్యాంకు తొలిసారి అధికారికంగా ప్రకటిం చింది. ఈ డిపాజిట్లలో భారతీయులకు ప్రత్య క్షంగానో పరోక్షంగానో ప్రమేయం వున్నట్లు స్విస్‌ జాతీయ బ్యాంకు అధ్యక్షుడి ప్రతినిధి వాల్టర్‌ మీర్‌ చెప్పారు. వివిధ స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్‌ చేసిన సొమ్ము 2010 డిసెంబర్‌ చివరి నాటికి 194.5 కోట్ల స్విస్‌ ఫ్రాంక్‌లు (250 కోట్ల డాలర్లుకు పైగా) ఉన్నట్లు ఆయన వివరిం చారు. ఇందులో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఆర్థిక సంస్థలు కార్పొరేట్‌లు సేవింగ్స్‌ డిపాజిట్ల రూపంలో జమ చేసింది 210 కోట్ల డాలర్లుకు పైగా వుంటుంద న్నారు. అయితే ఈ నిధుల గుర్తింపునకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ఆయన చెప్పారు. స్విస్‌లో రెండు అతి పెద్ద బ్యాంకులైన యుబిఎస్‌ క్రెడిట్‌ సురుస్సెలో భారత్‌కు చెందిన వ్యక్తుల డిపాజిట్లు అధికశాతం వున్నాయని మీర్‌ వివరించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!