డిప్యూటీ సీఎం. ఆజాద్ మంత‌నాలు..


కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ హైదరాబాద్ వచ్చారు. ఆయన కర్నాటకలోని గుల్బర్గాకు వెళ్లడానికి గాను హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఆయన కు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి దానం నాగేందర్ తదితరులు స్వాగతం చెప్పారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను వెంటబెట్టుకుని హెలికాఫ్టర్ లో అజాద్ గుల్బర్గా వెళ్లడం ఆసక్తికరపరిణామం. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అజాద్ తో చర్చల వ్యవహారం ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. వారు తమ రాజీనామాలను ఉపసంహరించు కోడానికి ససేమిరా అంటున్నారు.తెలంగాణపై తానేమి చేయలేనని, సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవాలని అజాద్ తేల్చేశారు. ఇక ఎన్ని చర్చలు జరిగినా ఏమవుతుందో తెలియని పరి్థితి ఏర్పడిన తరుణంలో రాజీనామా చేసిన కాంగ్రెస్ నేతలతో విభేదించి ఉప ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతున్న అజాద్ ను వెంటబెట్టుకుని వెళ్లడం, రాష్ట్ర రాజకీయాలు,ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చర్చించడం ఆసక్తికరమైన పరిణామం. ఈ పరిణామం కచ్చితంగా దామోదర రాజనరసింహకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాన్ని ఇస్తుంది.ఈ సమస్యకు ఏ రకంగా పరిష్కారం తేవాలన్నదానిపై వీరిద్దరు చర్చలు చేసుకునే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!