సి.ఎం. కాన్వాయ్‌లో పాము..


అవునండీ.. నిజం.. సాక్షాత్తూ సి.ఎం. కాన్వాయ్ల లోకి పాము దూరింది.. ప‌చ్చటి ప్రకృతి ఒడిలో.. చెట్టూ పుట్టల న‌డుమ తిరుగాడే పాము సి.ఎం. కాన్వాయ్‌లోకి ఎందుకు దూరాల్సి వ‌చ్చిందో అనే క‌దా మీ డౌటు..?  పాపం.. అడ‌వులు అంత‌రించిపోవ‌టంతో.. ఇప్పటికే చిరుత‌లు, ఏనుగులు జ‌నావాసాలు ఉండే ప్రాంతాల్లో తిరుగాడుతున్నాయి.. ఇప్పుడు పాముల వంతు వ‌చ్చింది.. అయితే పాములు మామూలుగా అన్నిచోట్లా ఉంటాయ‌నుకోండి.. పాముని చూడ‌గానే ముందు బ‌య‌ప‌డినా.. ఆ త‌ర్వాత దాని అంతు చూసే దాకా నిద్రపోరు క‌దా.. మ‌నుషులు.. అందుకే  సేఫ్‌సైడ్‌గా సి.ఎం.కాన్వాయ్ అయితే త‌న ప్రాణానికి ర‌క్షణ‌గా ఉంటుంద‌ని అందులోకి దూరి ఉంటుంది.. అది ఏ ఉద్దేశ్యంతో దూరినా కానీ.. అధికారుల‌ని మాత్రం ముప్పు తిప్పలు పెట్టింది.. మ‌నిషి దూరితే నాలుగు త‌న్ని బ‌య‌టికి వెళ్ళగొట్టొచ్చు.. కానీ దూరింది పాము క‌దా.. దాన్ని బ‌య‌టికి తీసేందుకు నానా తంటాలూ ప‌డ్డారు స‌ద‌రు అధికారులు.. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌లో పాల్గొన‌డానికి సి.ఎం. వెళ్ళిన సంద‌ర్భంలో జ‌రిగింది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!