నిరాశ‌ప‌ర్చిన టీమిండియా..


లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక‌మైన తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది.. 196 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. 474 ప‌రుగుల‌ని ఛేధించే క్రమంలో ఇండియా బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మ‌య్యారు. ఓటమి నుంచి భారత్‌ను పలు మార్లు కాపాడిన వివియస్ లక్ష్మణ్  అర్థ సెంచ‌రీ దాటిన త‌ర్వాత ఔట్ కాగా సురేష్ రైనా 78 ప‌రుగులు చేసారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక ఈ క్రెక్‌ట్ మైదానంలో టెస్టుల్లో 100వ సెంచ‌రీ చేసి రికార్డు సృష్టిస్తాడ‌నుకున్న స‌చిన్ టెండూల్కర్ ఫేల‌వ‌మైన ఆట‌తీరు అభిమానుల‌ని నిరాశ‌ప‌ర్చింది. లార్డ్స్ టెస్టులో భారత్ ఏ మాత్రం నెంబర్ వన్ జట్టు ప్రతిభను కనబరచలేకపోయింది. బిక్కు బిక్కుమంటూ ఆడినట్లే కనిపించింది. ఇంగ్లాండు దాడికి తలొగ్గుతూ వచ్చింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీని క్రిస్ ట్రెమ్లెట్ అవుట్ చేయడంతో మ్యాచు మలుపు తిరిగింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 34 ప‌రుగుల‌కు ఔట‌యిన స‌చిన్ రెండ‌వ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 12 ప‌రుగుల‌కే  అండర్సన్ బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు. జేమ్స్ అండర్సన్ రెండో ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీసుకుని భారత్ నడ్డి విరిచాడు. మొత్తానికి లార్డ్స్ మైదానంలో టీమిండియా ప‌రాజ‌యం పాల‌వ‌డం భార‌త్ అభిమానుల‌కు రుచించ‌డం లేదు. మ‌రి మిగ‌తా మ్యాచ్‌ల‌లో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!