యువ సంగీత ద‌ర్శ‌కుడి మృతి వెనుక‌..?

ఓ యువ సంగీత దర్శకుడి గుండె ఆగిపోయింది. ప్రేమ పెళ్లి కెరీర్‌పై కలలు గన్న అతడి హృదయం అర్ధంతరంగా నిలిచిపోయింది. మొదట సహజమరణమని సరిపెట్టుకున్నా తర్వాతి పరిణామాలు అతని మృతిపై సందేహాలు రేకెత్తించాయి. ఆ అనుమానాలకు ఆధారాలు కూడా దొరకడంతో సహజ మరణం కాస్తా అనుమానాస్పద మృతిగా మారిపోయింది. అసలు ఎవరా మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఏమా కథ….
అరడజను సినిమాలకు పైగా మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేసిన ఇతని పేరు అనిల్‌.ఆర్‌. ఇప్పుడిప్పుడే కెరీర్‌ పరంగా ఎదుగుతున్నఈయనకు షాలిని అనే అమ్మాయి పరియమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి క్రమంగా పెళ్లికి దారితీసింది. అంరంగ వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయింది. మనసుపడ్డ మగువతో మనువు కాబోతుందన్న సంతోషంలో ఉన్న అనిల్‌.. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
కాబోయే శ్రీమతిని కలిసొద్దాం అని ఆమె ఇంటికి వెళ్లిన అనిల్‌ హఠాత్తుగా అపోలో ఆస్పత్రిలో శవమై కనిపించాడు. దీంతో ఖంగుతిన్న కుటుంబసభ్యులు ఇదేంటని షాలినిని అడిగితే… తమ ఇంటికి వచ్చిన అనిల్‌ మాట్లాడుతూ ఉన్నట్టుండి కుప్పకూలాడని… దాంతో ఆస్పత్రికి తీసుకొచ్చామని జవాబిచ్చింది. అంతా తమ ఖర్మ అనుకున్న అనిల్‌ కుటుంబం అంత్య క్రియలు పూర్తి చేసింది.
కానీ దాని తర్వాత షాలిని ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన అనిల్‌ చావుపై అనుమానాల్ని కలిగించింది. కారులో కూర్చున్న అనిల్‌ ఉన్నట్టుండి తన ఒళ్లో వాలిపోయాడని ఒకసారి చెప్పిన షాలిని… ఇంకోసారి మాత్రం… తాను కారు బయట ఉండగా.. అనిల్‌ సీట్లో ఒరిగిపోయాడని చెప్పింది. అంతే కాదు.. ఆరోగ్యవంతుడైన అనిల్‌.. తనకు ఒకరోజు ముందు గుండెనొప్పి వచ్చిందని చెబుతూనే కుప్పకూలి పోయాడని చెప్పుకొచ్చింది.
ఇలా షాలిని చెప్పిన పొంతనలేని మాటలతో అనుమానం వచ్చిన అనిల్‌ కుటుంబసబ్యులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశ్‌ ఫిర్యాదు మేరకు శవాన్ని రెండు నెలల తర్వాత బయటకు తీసిన పోలీసులు దానికి పోస్ట్‌మార్టం జరిపించారు. శవపరీక్ష రిపోర్టులో బాధితుల అనుమానాలను నిజం చేసే ఆధారాలు దొరికాయి. అనిల్‌ది సహజ మరణం కాదని తలకు బలమైన గాయం అవడం వల్లే చనిపోయాడని పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వెల్లడించింది. అంతేకాదు..
చనిపోయే ముందు.. తామిద్దరం కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశామని షాలిని చెప్పగా… పోస్టు మార్టంలో మాత్రం అనిల్‌ కడుపు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఈ ఆధారాలతో అనిల్‌ది సహజ మరణం కాదు…హత్యేనని కుటుంబసభ్యులు నిర్ధారణకు వచ్చారు. చివరి నిమిషం వరకు అనిల్‌తోనే ఉన్న షాలినీయే అతణ్ని హత్య చేసి ఉంటుందని వారు భావిస్తున్నారు…ఇంతకీ అనిల్‌ది హత్యా.. ? ఒకవేళ హత్యే అయితే ఎవరు చేశారు.. ?
కుటుంబసభ్యులు అనుమానిస్తున్నట్లు.. షాలినీయే ఈ దారుణానికి ఒడిగట్టిందా.. ? చేస్తే.. దేనికోసం చేసింది…? ఎవరెవరు ఆమెకు సహకరించారు..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!