లార్డ్స్ మ్యాచ్‌కి వ‌రుణుడి షాక్‌..


చారిత్రాత్మక 2000వ టెస్టు లార్డ్స్ మైదానంలో మొద‌టి టెస్టు ఆట‌కి వరుణుడు షాకిచ్చాడు.. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగిపోతుంద‌నుకున్న మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా మంద‌కొడిగా సిగింది. ప‌రుగుల వ‌ర‌దా పార‌లేదు, వికెట్ల వేట సాగ‌లేదు.. టాస్ గెలిచిన భార‌త్ కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకుని బ‌రిలోకి దిగాడు. అప్పుడ‌ప్పుడూ వ‌రుణుడు ఆట‌కి బ్రేక్ వేసినా జ‌హీర్‌ఖాన్ అద్భుత‌మైన బౌలింగ్‌లో ఇంగ్లండ్ రెండు వికెట్లు న‌ష్టపోయింది. గురువారం ఆట‌ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది.. అర్ధశతకంతో రాణించిన జోనాథన్ ట్రాట్ (58)కు తోడుగా కెవిన్ పీటర్సన్ (22) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో భార‌త్ ఫేల‌వ‌మైన ఫీల్డింగ్‌తో ఊపుమీదున్న ట్రాట్‌ కీల‌క క్యాచ్ వ‌దిలివేయ‌డం భార‌త క్రికెట్ అభిమానుల‌కు రుచించ‌లేదు. ట్రాట్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భజ్జీ బౌలింగ్‌లోఇచ్చిన క్యాచ్‌ను ద్రావిడ్ జారవిడిచాడు. ట్రాట్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జహీర్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్ కీపర్ ధోనీ, ఫస్ట్ స్లిప్‌లో ద్రావిడ్ ఎవరూ పట్టలేదు. ఇప్పుడు ట్రాట్ ఫిఫ్టీతో క్రీజులో కొనసాగుతున్నాడు. మొత్తానికి భార‌త్ త‌న ఆట‌తీరును మ‌రింత మెరుగుపెట్టాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!