రఫ్పాడిస్తానంటున్న రబ్బానీ




ఎవరీ రబ్బానీ, ఎందుకు రఫ్పాడిస్తుందనుకుంటున్నారా… భారత్ – పాక్ సంబంధాలు, శాంతి చర్చలు ఫాలో అవుతు న్నవారు ఇట్టే రబ్బానీ ఎవరో పసిగట్టగలరు. రబ్బానీ హినా రబ్బానీ. పాకిస్తాన్ విదేశాంగ తొలి మహిళా మంత్రిగా హినా రబ్బానీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ కాశ్మీరు సమస్యపై కన్నేసింది. భారత్ తో జరిగే చర్చల్లో ఇరగదీస్తా నంటూ ఢిల్లీకి వచ్చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణతో భేటీ అయింది కూడా. ఇంతకీ ఈ సుందరాంగి పాకిస్తాన్ రాజకీయాలతో ఎలా నెగ్గుకు వస్తుందో ఓసారి చూద్దాం…
హినా రబ్బాని పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఆమె మనదేశానికి వస్తుందన్నప్పటి నుంచీ ఎవరీ రబ్బానీ ? అన్న చర్చ జరుగుతూనే ఉంది. పాకిస్తాన్  లో విదేశాంగ మంత్రిగా ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారి. చదువైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా చిత్తశుద్ధితో ముందుకు  దూసుకుపోవడం హినా రబ్బానీ స్టైల్.
1977 జనవరి 19న  జన్మించిన హినా తన తండ్రి గులామ్ రబ్బానీ ఖర్ రాజకీయ జీవితంతో ప్రభావితమయ్యారు. హినా లాహోర్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ హానర్స్ పూర్తిచేసిన తరువాత అమెరికాలో హోటల్ మేనేజ్ మెంట్ లో ఎంఎస్సీ పూర్తిచేశారు. లాహోర్ లోని పోలో గ్రౌండ్స్ లో పాపులర్ రెస్ట్రారెంట్ కు ఈమె కో-ఓనర్.
అనేక సామాజిక అంశాలపై చురుగ్గా స్పందించే నేర్పు ఉన్న హినా రబ్బాని  2002లో నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మొదట్లో `పాకిస్తాన్ ముస్లీం లీగ్ – క్యూ’ తరఫున పోటీ చేసినప్పటికీ, 2008కి వచ్చేసరికి ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీ చేసి 84వేల కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశాంగ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హినా రబ్బాని ఇప్పుడు పూర్తి స్థాయి మంతిగా ఎదిగారు.  కాశ్మీరు సమస్య పరిష్కారం కోసం ఆమె దృష్టిపెట్టారు. భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక వ్యవహారాల్లో ఆమె స్టైల్ ఏమిటో చూడాల్సిందే…
- ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!