మ‌ళ‌యాళ స్టార్ల‌కు ఐటి చిక్కులు


మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి, మోహన్ లాల్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నుంచి సాగుతున్న సోదాల్లో కొన్ని కీలక పత్రాలతో పాటు.. భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి పేరును తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్లపై ఐటీ కన్ను పడింది. ఆదాయానికి మించి ఆస్తులున్న సమాచారంతో పాటు.. గత కొన్నేళ్లుగా వాళ్లు సమర్పిస్తున్న ఐటీ రిటర్న్స్.. వాళ్లు సంపాదించే ఆదాయానికి సరిపోకపోవడంతో ఈ దాడులు నిర్వహించినట్లు చెబుతు న్నారు. మరోవైపు వీళ్లకు సినిమా ద్వారానే కాకుండా.. ఇతర ఆదాయ మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. ఏకకాలంలో కొచ్చి చెన్నై, బెంగళూరుల్లోని వాళ్ల ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. మమ్ముట్టిని ఏకంగా ఏడు గంటల పాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు అతని నుంచి 20 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!