జ‌గ‌న్‌కి వ్యతిరేకంగా తీర్పు..?


జగతీ పబ్లికేషన్ దాఖలు చేసిన మూడు స్పెషల్ లీవ్ పిటీషన్లను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. సీబీఐ విచారణ పై హైకోర్టు తీర్పుపై సంతృప్తి లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. సీబీఐ నివేదికను ప్రతివాదులకు కూడా అందించాలని సుప్రీం స్పష్టం చేసింది. విచారణను వచ్చేనెల 13కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకుని తీర్పు ఇవ్వలేమని సుప్రీంకోర్టు జడ్జులు చెప్పారు. సిబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ జగన్ స్పేషల్ లీవ్ పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టులో జ‌గ‌న్‌కి వ్యతిరేకంగా తీర్పు వెలువ‌డింద‌న్న వార్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గం అంగీక‌రించ‌డంలేదు. సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకం అనే ప్రచారం జరుగుతోందని.. ఇది ఎంతమాత్రం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మేము ఎప్పటి నుంచి జగన్ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీని ఆహ్వానించామని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణ.. రాజకీయకక్ష్యతో జరుగుతోందని ఆయన ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. సీబీఐ నివేదిక వ్యతిరేకంగా వస్తే.. వాదనలు వినిపించొచ్చని కోర్టే తెలిపిందని ఆయన అన్నారు. ఇక పిటీషన్ వేసిన శంకర్రావు, హోంమంత్రి చిదంబరంతో ఈ కేసుపై గంటల కొద్దీ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు శంకర్రావే తెలిపారన్నారు. ఈ కేసులో సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటు న్నారని.. ఈ సంఘటనే తెలియజేస్తుందన్నారు. తమకెలాంటి భయం లేదని.. ఎంతవరకైనా పోరాడతామన్నారు. న్యాయస్థానంలో తప్పక విజయం మాదేనని అంబటి చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం న్యాయపోరాటంలో ఒక భాగం మాత్రమేనని చెప్పారు. అన్నిదశల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలపడం మా ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తనపై జరుగుతున్న విచారణపై స్టే తెచ్చుకున్నారని.. ఇప్పుడు జగన్ ఎలాంటి అధికారం లేదని.. అయినా న్యాయస్థానంలో గెలుపు మాదే అని అంబటి అన్నారు. మా ధైర్యం, సచ్ఛీలత ఏంటో రాబోయే కాలంలో ప్రజలకు.. ప్రత్యర్థులకు అందరికీ తెలుస్తుందని ఆయన చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!