జ‌గ‌న్ భ‌విష్య‌త్తు అందులో..


జగన్ ఆస్తుల కేసులో ప్రాధమిక విచారణ నివేదికను సిబిఐ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది.జగన్ ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ శంకరరావు రాసిన ఒ క లేఖ ఆధారంగా హైకోర్టు సిబిఐని ప్రాధమిక విచారణ జరపవల సిందిగా ఆదేశించింది.రెండువారాలపాటు ఇరవై మూడు కంపెనీలను సిబిఐ విచారించింది. ఆయా కంపెనీలకు సిబిఐ నోటీసులు జారీ చేయడం, ఆ కంపెనీల వారంతా తమ వద్ద ఉన్నడాక్యుమెంట్లను సమర్పించడం, కొందరి నుంచి వారు గంటల తరబడి ప్రశ్నల రూపంలో సమాచారం సేకరించడానికి కూడా యత్నించారు.అయితే రెండువారాలలో హైకోర్టు కోరుకున్నప్రకారం నివేదిక ఇవ్వడం విశేషం. సాధారణంగా ఇంత పెద్ద కేసులలో టైమ్ సరిపోదని విచారణాధికారులు చెబుతుంటారు. కాని సిబిఐ డిఐజి సరిగ్గా రెండువారాలోనే నివేదిక ఇవ్వడం అభినందనీయం. అయితే ఇప్పుడు ఈ నివేదికలో ఏముందన్నది ఆసక్తికరం. సీల్డ్ కవర్ లో జగన్ భవితవ్యాన్ని హైకోర్టుకుఇచ్చారని అనుకోవచ్చు. బుధవారం నాడు హైకోర్టు ఈ కవర్ ను విప్పి అందులోని విషయాలను వెల్లడిస్తుందా? లేక మరి కొంత కాలం తీసుకుంటుందా అన్నది చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!