సాయి ట్రస్ట్ లెక్కల్లో నో ‘ట్రస్ట్’


సత్యసాయి ట్రస్టు ఇచ్చిన నివేదికను పరిశీలించిన త్రిసభ్య కమిటీ పూర్తిగా అసంతృప్తి చెందినట్లు కధనాలు వస్తున్నాయి.ట్రస్టు వారిని ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు అసలు సరైన సమాధానాలే ఇవ్వలేదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.దీనిపై రెవెన్యూశాఖ కార్యదర్శి రమణాచారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్ కు కమిటీ అభిప్రాయాలను వివరిస్తూ నివేదికను అందించారు.సత్యసాయి ట్రస్టు వారు ఇచ్చిన వివరాలన్నీ గందరగోళంగా ఉన్నాయని కమిటీ సభ్యులు తెలుసు కున్నారు.త్రిసభ్య కమిటీలో ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెంట్ కె.నరసింహమూర్తి, శ్రీహరిబాబు,ఓవిఆర్ రెడ్డిలు ట్రస్టు ఇచ్చిన వివరాలను పరిశీలించారు.సత్యసాయిబాబ అనారోగ్యానికి గురై చికిత్స పొందినప్పుడు ప్రశాంతి నిలయంలో జరిగిన విషయాలపై మీడియాలో వచ్చిన కధనాలపై ప్రభుత్వం తొమ్మిది అంశాలపై వివరణ కోరింది.ఈ ప్రశ్నలను సాయిట్రస్టు అసలు పట్టించుకోలేదు.తమకు తోచిన వివరాలేవో ఇచ్చి ట్రస్టు సభ్యులు చేతులు దులుపుకున్నారని అంటున్నారు.ట్రస్టు వ్యవహారాలపై సమగ్ర నివేదిక అందచేయడానికి మరికొంత గడువు కావాలని ఈ సందర్భంగా కమటి ప్రభుత్వాన్ని కోరింది. ఈ పరిస్థితిలో ట్రస్టుకు మరో నోటీసు జారీ చేసి మరిన్ని వివరాలను కోరవచ్చని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!