ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికారులు..


సిబిఐ అధికారుల విచారణతో జగన్ ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జగన్ కంపెనీలలోకి ఆర్థిక మూలాలు ఎక్కడి నుండి వచ్చాయి. కార్మెలుకు జగతికి సంబంధం ఏమిటి, ఏ ప్రాతిపాదికన పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు షేర్లు కేటాయించారు. నగదు బదిలీలు ఎలా జరిగాయి. తదితర విషయాలపై జగతి డైరెక్టర్ ను మొదటి రోజు 8 గంటల పాటు, ఆడిటర్ ను 6 గంటల పాటు విచారించింది. దాదాపు 15 కంపెనీలను ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరిపింది. ల్యాంకో అనుబంధ సంస్థ లార్స్ కో, జూబ్లీ వెంచర్స్, పెన్నా తదితర కంపెనీలను విచారించాయి. వారిని పెట్టుబడులపై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారికి పెట్టుబడులు పెట్టే స్థాయి ఉందా అని పరిశీలిస్తోంది. లేదా ఇతర మార్గాల ద్వారా లాభాలు పొంది పెట్టుబడులు పెట్టారా అనే విషయంపైనా విచారణ జరుపుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో తవ్విన కొద్ది కంపెనీలు బయటపడుతుండటంతో సిబిఐ అధికారులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఉన్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అయితే పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. జగన్ కంపెనీలను, జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను రోజు గంటల కొద్ది విచారణ జరిపినప్పటికీ కొత్త కొత్తవి వెలుగులోకి రావడంతో సిబిఐ అధికారులు హైకోర్టును మరికొంత సమయం కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఆస్తులపై విచారణ చేపట్టిన మొదటి రోజే జగతి పబ్లికేషన్స్‌ ప్రతినిధులను సుమారు 8 గంటల పాటు విచారించారు.
జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వివిధ కంపెనీల నుండి పూర్తి డాక్యుమెంట్లు తీసుకున్నారు. పెట్టుబడులకు డబ్బులు ఎక్కడి నుండి తరలించారు అనే కోణంలోనూ విచారిస్తున్నారు. భూకేటాయింపుల ద్వారా లబ్ది పొంది జగన్ కంపెనీలలో పెట్టుపడులు పెట్టారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. అందుకోసం పరిశ్రమలు, భూగర్భ గనులు తదితర కార్యాలయాల నుండి కీలక డాక్యుమెంట్లు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఏపిఐఐసి నుండి సైతం డాక్యుమెంట్లు తెప్పించుకొని భూకేటాయింపులలో అక్రమాలను పరిశీలిస్తున్నారు. మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా అని చూస్తున్నారు. ఆయా కార్యాలయాలలో సంతకాలు చేసిన అధికారులను సైతం విచారించేందకు సిబిఐ ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి పెట్టుబడులు పెట్టిన కంపెనీలపైనా దృష్టి సారించింది.
మొత్తానికి జ‌గ‌న్ ఆస్తుల‌పై విచార‌ణ చేప‌ట్టిన సిబిఐ అధికారులు త‌వ్విన కొద్దీ వ‌చ్చిప‌డుతున్న ఆస్తుల వివ‌రాల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. మ‌రో వైపు సిబిఐ సోదాలు నిలుప‌ద‌ల చేయాలంటూ జ‌గ‌న్ సుప్రీంకోర్టును ఆశ్రయించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది..

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!