ఆజాద్‌తో చ‌ర్చల‌కు టి-నేత‌లు రెడీ


సోమవారం నాడు జరిగే సంప్రదింపుల ప్రక్రియకు.. 12 మంది సభ్యులను ఎన్నుకున్నామని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఆజాద్ తో జరిగే చర్చలకు 12 మందిని ఎన్నుకున్నామ న్నారు. ఒక్కొక్కరు ఒక్కో అంశంపై ఆజాద్ తో చర్చిస్తారని జానారెడ్డి తెలిపారు. మరోవైపు సంప్రదింపుల ప్రక్రియకు స్టీరింగ్ కమిటీలోని 23 మంది సభ్యలూ ఢిల్లీకి వెళ్తారని చెప్పారు. కాగా 2001 నుంచి ఇప్పటివరకు తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటించిన అనుకూల నిర్ణయాలన్నీ.. ఆజాద్ కు వివరిస్తామని.. శుక్రవారం ఆజాద్ తో భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా తెలంగాణపైనే చర్చకు వస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు ఆజాద్ శనివారం నాడు గుల్బార్గాలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంప్రదింపుల ప్రక్రియ తర్వాతే.. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్ స్పష్టం చేశారు. ఇప్పుడే ఎవరికి వారు గెల్చినట్లు మాట్లాడుతున్నారని.. సంయమనం పాటించాలని ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. మూడు ప్రాంతాల నేతలతో చర్చిస్తానని ఆజాద్ చెప్పుకొచ్చారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!