`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు- 5



కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలో అపార సంపద బయటపడినం  దుకు సంతోషించాలో, లేక ఆరో గదికి నాగబంధం ఉన్నం దుకు భయపడాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అక్కడి స్థానికులు (తిరువనంతపురం వాసులు) చెబ్తున్న విషయాలు చాలా చిత్రంగా అనిపిస్తుండటమే…

కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని ఇలాంటి చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.
1. నాగబంధం అన్నది మొత్తం నిధినిక్షేపాలకు వర్తిస్తుంది.
2. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు.
3. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది.
4. సంపద వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాత్రువియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది.
5. ఐదు గదులను తెరిచిన తరువాత ఆరోగదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపులపై నాగపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు.
6. ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
7. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు.
8. ఇందుకు పరాకాష్టగా నిధులపై కోర్టులో కేసు వేసిన  ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారు.
9. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం.
10. ఆపార నిధినిక్షేపాలు ఐదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు ఈ రచయితతో ఫోన్ ద్వారా చెప్పారు.

- తుర్లపాటి నాగభూషణ రావు

nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!