ఉతికి.. ఆరేసి.. ఇస్త్రీ చేశారు..


ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియా, ఇంగ్లండ్‌ల మ‌ధ్య‌న జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్ మొద‌టిరోజు ఆట చూసిన ఎవ‌రికైనా టీమిండియా ఇంగ్లండ్‌కి గ‌ట్టి పోటీ ఇవ్వ‌బోతుంద‌ని భావించారు. వ‌రుణుడు కాసేపు ఆట‌కి ఆటంకం క‌లిగించినా జ‌హీర్‌ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో ఇంగ్లండ్‌ని దెబ్బ‌కొట్టార‌నుకున్నారు.. కానీ రెండ‌వ రోజు ఆట‌లో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది.. ఇంగ్లండ్ ఆట‌గాళ్ళు బ్యాట్‌తో ఫోర్లు, సిక్స‌ర్‌లు బాదుతుంటే బిక్క‌మొహాలు వేసుకుని చూస్తూ ఉండిపోయారు. కెప్టెన్ ధోని ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా, చివ‌రికి తాను కూడా బంతి ప‌ట్టి బౌలింగ్ చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ముఖ్యంగా పీట‌ర్స‌న్ టీమిండియా బౌలింగ్‌ని సింపుల్‌గా చెప్పాలంటే ఉతికి.. ఆరేసి.. ఇస్ట్రీ చేశాడు.. విశిష్ట మ్యాచ్‌లో జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 21 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 202 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పీట‌ర్స‌న్‌తో పోటు ప్రయర్ 71, ట్రాట్ 70, బెల్ 45 రన్స్‌తో రాణించ‌డంతో 474 ప‌రుగుల త‌ర్వాత డిక్లేర్ చేసారు.. ఇక బ్యాటింగ్‌కి దిగిని ఇండియా 17 ప‌రుగులు చేసిన త‌ర్వాత రెండ‌వ‌రోజు ఆట‌ముగిసింది.. మ‌రి.. ఇంగ్లండ్‌కి ధీటుగా ఇండియా కూడా బ్యాటింగ్‌తో స‌మాధానం చెబుతుందా..? చ‌తికిల‌ప‌డుతుందా అన్న‌ది చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!