ఉప్పొంగుతున్న వాగులు, న‌దులు..


వ‌ర్షాల కార‌ణంగా కృష్ణా, గోదావ‌రి న‌దులు నిండిపోతు న్నాయి.. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. అయితే భక్తులు పుణ్యస్నానాలు చేసే స్నానాల ఘట్టు వద్ద అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం 847 అడుగులకు చేరింది. నీటి నిల్ల సామర్థ్యం 111.5 టీఎంసీలుగా నమోదైంది.. ఇన్‌ఫ్లో లక్షా 40 వేల క్యూసెక్కులుగా ఉంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి ఉదృతి పెరిగింది. నీటిమట్టం 11.2 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం కనిష్ట స్థాయిలో ఉంది. నీటి మట్టం 10.3 అడుగులకు పడిపోయింది.
భారీ వ‌ర్షాల‌తో అక్క‌డ కృష్ణా గోదావ‌రిలో నీళ్ళ ప్ర‌వాహంతో నిండిపోతుంటే.. ఇక్క‌డ మ‌న రాజ‌ధాని హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో రోడ్ల‌న్నీ నీళ్ల‌తో నిండిపోయాయి.. అమీర్‌పేట, ఎర్ర గడ్డ, ఖైరతాబాద్, పంజాగుట్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వర్షాల కారణంగా విమానరాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సూర్యాపేట డివిజన్‌లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నూతనకల్లు, ఆత్మకూరు (ఎస్) మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీని ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!