బొత్స‌… వామ‌నావ‌తారం..


ఒక్కోసారి నాయకులు తెలిసో, తెలియకో కొన్ని కార్యక్ర మాలకు ఒప్పుకుని బుక్ అయిపోతుంటారు. గతంలో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పుస్త కాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో తెలంగాణకు వ్యతిరే కమైన వాదన ఒకటి ఉంది. దాంతో ఆయన తాను చదవ కుండా పుస్తకాన్ని ఆవిష్కరించానని వివరణ ఇచ్చుకోవ లసి వచ్చింది.తాజాగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ అలాంటి వివాదంలోనే ఇరుకున్నారు.బొత్స త్రిశూల్ అనే ఒక పత్రికను కొంతకాలం క్రితం ఆవిష్కరించారు. అంతవరకు బాగానే ఉంది. ఆ పత్రిక కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఒక సంచికలో బొత్స సత్యనారాయణ వామనావతారం ఎత్తినట్లు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఒక కాలుతో తొక్కుతున్నట్లు బొమ్మ ప్రచురించారు.దీనిపై ఒక కధనాన్ని కూడా ఇస్తూ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు. మనందరిని ఏలే నాయకుడుగా బొత్స అవతరిం చాలని అంతా కోరుకుంటున్నారంటే అతిశయోక్తికాదు అని రాశారు.ఆ రోజు ఇంకెంత దూరం లేదేమో అని ముగించారు.బొత్స జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచురించిన ఈ ప్రత్యేక సంచిక కాంగ్రెస్ లో కలకలం రేపుతోందని కధనాలు వస్తున్నాయి. తొలుత గాంధీభవన్ లో పంపిణీ చేసినప్పటికీ, ఆ తర్వాత కొందరు వాటిని వెనక్కి తీసేసుకున్నారని అంటున్నారు.సహజంగానే దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగాని, ఆయన సన్నిహితులుగాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కధనాలు కూడా వస్తున్నాయి. బొత్సకు ఈ వ్యవహారంలో నేరుగా సంబందం ఉందని అనలేకపోయినా, ఆయన మద్దతుదారుడు ఒకరు చేసిన అతికి ఆయనకు చికాకు కలిగిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!