త‌న ఆస్తుల‌ని వెల్లడించిన రాష్ట్రప‌తి


రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం తన చర, స్థిరాస్తులను ప్రకటించారు. వాటి విలువ రూ. 2.49 కోట్లు ఉంటుంది. ప్రధాని తరహాలో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆమె తన ఆస్తులను ప్రకటించారు. నాలుగేళ్లుగా ఆమె రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. తన ఆస్తుల వివరాలను ఆమె వెబ్‌సైట్‌లో ఉంచారు. స్థిరాస్తుల విలువ రూ. 83.83 లక్షలు ఉండగా, చరాస్తుల విలువ రూ. 1.66 కోట్లు ఉంది. ప్రతిభా పాటిల్‌కు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రూ.39.60 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. రూ. 9.82 లక్షల విలువ చేసే 3.82 హెక్టార్లలో ఫామ్ హౌస్ ఉంది. తన తండ్రి నుంచి వారసత్వంగా లభించిన జల్గావ్‌లో 3.57 హెక్టార్ల వ్యవసాయ భూమి, ధూలే జిల్లాలో 20 లక్షల విలువ చేసే మరో భూమి ఉన్నాయి. ఆమెకు 31 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!