సోమ‌వారం వ‌ర‌కూ ఆగాల్సిందే..


జగన్ ఆస్తుల కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.సిబిఐ జగన్ ఆస్తులకు సంబందించి సమర్పించిన నివేదికను ఇంకా పరిశీలించలేదని హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. సిబిఐ నివేదిక కాపీ కావాలని కోరగా ఇంకా తాము కూడా చూడలేదని కవర్ ను న్యాయమూర్తులు చూపారు.అయితే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయవలసిందిగా వారు కోరారు. అయితే కోర్టులోనే న్యాయమూర్తులు నివేదికను తిలకించారు.. కేసు పూర్వాపరాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. అలాగే హైకోర్టుకు రాసిన లేఖలోని అంశాలపై అందరి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా జగన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ పిటిషన్ దారుడైన శంకరరావు విశ్వసనీయత గురించి అలాగే, ఇలాంటి లేఖలను పరిగణనలోకి తీసుకోవడంపై గతంలో సుప్రింకోర్టు చెప్పిన విషయాలను కూడా ప్రస్తావించారు. కాగా పూర్తికాని ప్రాధమిక విచారణను కొనసాగించడానికి సిబిఐ అనుమతి ఇచ్చింది. ఎమ్. ఆర్.ప్రాపర్టీస్, జగన్ ఆస్తల వ్యవహారాలపై మంత్రి శంకరరావు రాసిన లేఖలు రాయడం, తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు ప్రభృతులు కూడా తోడవడం తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!