ఆ హీరోకి ఇచ్చిన బిరుదు క్యాన్స‌ల్‌..?


ప్రముఖ సినీ నటుటు మోహన్ లాల్, ముమ్మట్టిలపై ఆదాయపన్నుశాఖ దాడులు చేయడం కేరళలో సంచల నంగా మారింది. ఎన్నో వీరోచిత, ఆదర్శవంతమైన పాత్రలు పోషించిన వీరు ఆదాయపన్నును ఇంత భారీగా ఎగవేయడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. అక్కడితే ఆగకుండా మోహన్ లాల్ కు సైన్యం నుంచి లభించిన గౌరవ బిరుదు లెఫ్టినెంట్ కల్నల్ ను కూడా వెనక్కి తీసుకోవాలని కొందరు డిమాండు చేయడం ఆరంభించారు. మోహన్ లాల్, ముమ్మట్టిలపై కొద్ది రోజుల క్రితం ఆదాయ పన్నుశాఖ దాడులుచేసి,భారీగా పన్ను ఎగవేసినట్లు కనిపెట్టింది.అలాగే వారి ఇళ్లలో ఏనుగు దంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మోహన్ లాల్ అనేక సినిమాలలో సైనికుడిగా, సైనికాధికారిగా వివిధ పాత్రలు పోషించారు.దానిని గౌరవించి రక్షణ శాఖ ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది.ఈ నేపధ్యంలో ప్రముఖ సినీ రచయిత సుకుమార్ అజికోడ్ ఒక డిమాండు చేస్తూ, మోహన్ లాల్ గౌరవ హోదాను తొలగించాలని కోరారు.గతంలోనే మోహన్ లాల్ పై ఈయన ఒక దావా కూడా వేశారు.మోహన్ లాల్ ప్రకటనలలో నటించరాదని,ఆయనకు వయసుకు తగ్గ పాత్రలనే పోషించాలని అందులో కోరారు.సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటివారు ఆదాయపన్ను ను ఈ రకంగా ఎగవేయడం సిగ్గుచేటని, అభిమానులను అబిమానాన్ని వీరు దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.రక్షణ శాఖ మంత్రి కూడా ఎకె ఆంటోని కూడా కేరళ వ్యక్తి కావడంతో ఈ వివాదం ఆయనకు తలనొప్పిగా మారవచ్చని అంటున్నారు. రక్షణ శాఖ గౌరవహోదాలో ఇచ్చిన బిరుదును తొలగిస్తే ఆయన అభిమానులలో ఆగ్రహం వస్తుందని, బిరుదు తొలగించకపోతే, ఆదాయపన్ను ను ఎగవేసిన వ్యక్తికి బిరుదు ఇచ్చినట్లవుతుంది.మరి ఆంటోని ఈ డైలమా నుంచి ఎలా బయటపడతారో!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!