ఆత్మర‌క్షణ‌లో టిఆర్ ఎస్‌


ఎపి భవన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఆత్మ రక్షణలో పడడంతో, దీనిని ఎదుర్కోవడానికి ఎదురుదాడి ఆరంభించింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవాన్ని ఎపి భవన్ కు తీసుకురానివ్వకుండా శ్మశాన వాటికకు తీసుకు వెళ్లాలని అధికారులు ఉత్తరం రాస్తే ఆవేశానికి లోనయ్యానని, అవసరమైతే జైలుకువ ఎళ్లడానికి సిద్దమేనని అన్నారు. ఈ ఘటనను ఆసరా చేసుకుని లగడపాటి రాజగోపాల్, ఇతర నాయకులు దీనిపై కుట్ర చేసి అక్రమ కేసు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా మరో ఎమ్మెల్యే తారకరామారావు మాట్లాడుతూ సైన్యం పెడతామన్న మంత్రి టిజి వెంకటేష్ ను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలేదని, ఆత్మాహుతి దాడులు చేస్తామన్న కేశవ్ పై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ నాయకుడికి ఒక న్యాయం, సీమాంధ్రకు ఒక న్యాయమా అన్నారు. ఎపి భవన్ లో జరిగిన దాడి ఉద్దేశ్యపూర్వకంగా కాదని అన్నారు. మరో నేత కొప్పుల ఈశ్వర్ కూడా దీనికి ఎస్.సి., ఎస్.టి. కేసు పెట్టడం తప్పున అని వ్యాఖ్యానించారు. హరీష్ రావుపై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!