`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు- 6



కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నాగబంధం వెనుక దాగున్న రహస్యాలను తిరువనం తపురం లోని స్థానికుల నుంచి తెలుసుకునే ప్రయత్నం ఈ రచయిత చేస్తున్నారు.
కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని ఇలాంటి చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరించే పని ఐదో భాగంలో ప్రారంభమైంది. పది అంశాలను మీరు చదివే ఉంటారు. మిగతా పాయింట్స్ ఇవి…

11. నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది.

12. ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి.

13. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు.

14. అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి.


15. మరి ఆరోగది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందని ఈ రచయిత కేరళలోని తాంత్రికుడ్ని ఫోన్ ద్వారా అడిగారు.


16. ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా, తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైంది. కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు.


17. ఆరోగది తలుపులు తెరిస్తే, అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు. మరిన్నిదారుణాలు జరగవచ్చు.


18. తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా…అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది…


19. ఆ పని ముందే చేయాల్సింది. అంటే, మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధినిక్షేపాలను విముక్తి చేసిన తరువాత గది తలుపులు తెరిస్తే బాగుండేది.

- తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!