ఒళ్ళు దాచుకోవ‌చ్చేమో గానీ…!


సాధార‌ణంగా ఆడ‌వాళ్ళు త‌మ వ‌య‌సెంతా అంటే చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.. ఇక సినిమా తార‌ల‌యితే అస‌ల‌లాంటి క్వ‌శ్చ‌న్ వేస్తేనే గుర్రుగా చూస్తారు.. ఒక‌ప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోయిన్లు త‌మ వ‌యసు మీద‌ప‌డుతున్నా కొద్దీ త‌మ వ‌య‌సు బ‌య‌టి వారికి తెలియ‌కుండా చేయ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తుంటారు.. ఆ కోవ‌లోకి ఇప్పుడు శ్రియ వ‌చ్చి చేరింది. సినీ ప‌రిశ్ర‌మ‌కి శ్రియ 12 సంవ‌త్స‌రాల క్రితం ప‌రిచ‌య‌మైంది. అప్ప‌టికి ఆమె వ‌య‌సు ఇర‌వైకి అటూ ఇటూ ఉంటుంది.. కానీ.. ఇప్పుడు తాను ఇంకా యంగ్ లేడీనే అనిపించుకోవ‌డానికి, త‌న వ‌య‌సు 25 ఏళ్ళ‌లోపే అని చెప్పుకోవ‌డానికి నానా తంటాలూ ప‌డుతోంది. ఎలాగూ శ్రియ‌ని యంగ్ హీరోలు ప‌క్క‌న పెట్ట‌డంతో క‌నీసం అప్‌క‌మింగ్ హీరోల‌తో న‌యినా హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేయాల‌నుకుంటోంది శ్రియ‌.. అయినా ఒళ్ళు దాచుకోవ‌చ్చేమో కానీ.. వ‌య‌ సుని ఎంత‌కాలం దాచిపెట్ట‌గ‌లం..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!