31, అక్టోబర్ 2011, సోమవారం

కాంగ్రెస్ వీడితే తెలంగాణ ఆల‌స్యం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితో తెలంగాణ సాధన మరింత ఆలస్యం అవుతుందని నిజామాబాద్ ఎమ్.పి మదుయాష్కి అన్నారు. రెండువేల పద్నాలుగు నాటికి తెలంగాణను సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని కూడా ఆయన చెప్పారు.టిఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరితే పార్టీ బలోపేతం అవుతుంది కాని తెలంగాణ రాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా మరో సీనియర్ నేత కేశవరావు కూడా టిఆర్ ఎస్ పార్టీ కాస్త సున్నితంగా వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను చీల్చడానికి ప్రయత్నించడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని, సోనియాగాందీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అధికారంలో ఉండి జైలుకు వెళ్లామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ను చీల్చితే ఉద్యమానికి దెబ్బ అని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చే పార్టీని వదలి, రోడ్డుమీద అరిచే పార్టీలో చేరితే ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా లేదు..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడలేదని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యాఖ్యానించారు. ఇంతవరకు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందలేదని గవర్నర్ అన్నారు. తెలంగాణ లో శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందంటే తాను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం బలపరీక్ష చేసుకోవలసిన అవసరం లేదని కూడా ఆయన స్సష్టం చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి సబా విశ్వాసం పొందాలని ఏ కారణంతో అడగాలని కూడా నరసింహన్ ప్రశ్నించారు. మొత్తం మీద గవర్నర్ ప్రస్తుతానికి ప్రభుత్వం మైనార్టీలో పడలేదని చెప్పడం ద్వారా ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను గవర్నర్ కొట్టి పారేశారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఈ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టాలని డిమాండు చేస్తున్న నేపధ్యంలో గవర్నర్ ఈ విషయాన్ని తేల్చివేసినట్లయింది. అయితే ఇప్పుడు గవర్నర్ ను కలిసి ఎవరైనా విశ్వాస పరీక్ష కోరితే తప్ప కిరణ్ సర్కార్ కు మరికొంతకాలం పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవాలి.

అద్భుత దృశ్యకావ్యం శ్రీ‌రామ‌రాజ్యం

నంద‌మూరి బాల‌కృష్ణ రాముడిగా, న‌య‌న‌తార సీత‌గా, బాపు ద‌ర్శక‌త్వంలో అత్యద్భుతంగా తెర‌కెక్కిన చిత్రం శ్రీ‌రామ‌రాజ్యం. ఈ చిత్రం ఆడియో అభినంద‌న స‌భ సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, డి.రామా నాయుడు, కృష్ణంరాజు, శ్రీకాంత్, కోడిరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, బాలయ్య, బ్రహ్మానందం, గిరిబాబు, మురళీమోహన్, జొన్నవిత్తుల, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, సాగర్, బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చూడాలంటే బాపు… తెలుగు వినాలంటే రమణ. అందుకు నిదర్శనమే ఈ శ్రీరామరాజ్యం. ఈ రోజు రాముడిగా నన్ను చూశారు. రేపు ఈ రాముడు పలుకులు ఎలా ఉంటాయో వింటారు. ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు. ఆయన తప్ప ఈ కథను ఇంతబాగా తీయగలిగిన వారు లేరు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ శ్రీ‌రామ‌రాజ్యం చిత్రం అద్భుత దృశ్య కావ్యంగా తెలుగు సినీ చ‌రిత్రలోనిలిచిపోతుంద‌ని ప‌లువురు వ‌క్తలు వ్యాఖ్యానించారు.

రూపాయికే కిలోబియ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర పేద ప్రజ‌ల‌కు ఒక్కరూపాయికే కిలోబియ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనీ పూర్తి చేసింది. గ‌తంలో నంద‌మూరి తార‌క‌రామారావు ప్రవేశ‌పెట్టిన 2 రూపాయ‌ల‌కే కిలో బియ్యం ప‌థ‌కానికి ధీటుగా రూపాయికే కిలో బియ్యం ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.. అందుకే రాష్ట్రంలో ఏడున్నర కోట్ల కంటే ఎక్కువ మందికి రూపాయికి కిలో బియ్యం పథకం అమలు చేయనున్నట్టు సీఎం కార్యాలయం(సీఎంవో) తెలిపింది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న(బీపీఎల్) మొత్తం 2.6 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. మంగళవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లోని అన్ని రేషన్ షాపుల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు సీఎంవో వివరించింది.

కోమ‌టిరెడ్డి ఆమ‌ర‌ణ దీక్ష

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. ఇక్కడి తెలంగాణ చౌక్ (క్లాక్ టవర్ సెంటర్)లో ఉదయం 11 గంటలకు ఆయన దీక్ష ప్రారంభిస్తారు. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తారు. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ఏర్పాటుపై రోడ్ మ్యాప్ ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందని కోమటిరెడ్డి ప్రకటించారు.

ఇందిర‌మ్మా.. నీకు జోహార్లు..!!

కుమార్తెగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించే ఓ భారత స్త్రీ.. ఉక్కు మహిళగా, చరిత్ర సృష్టికర్తగా, దేశనేతగా ఎదిగిన పరిణామక్రమమిది. దేశ భవిష్యత్‌ కోసం అహర్నిశలూ పనిచేసిన ఆమే ఇందిరా గాంధీ. ఇవాళ ఆ మహా నాయకురాలి వర్థంతి సందర్బంగా ప్రత్యేక కథనం. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఇండియన్‌ ఉమెన్‌ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు ఇందిరాగాంధీ. సొంతబాడీగార్డుల చేతిలో 1984, అక్టోబర్‌, 31న హతమై ఇరవయ్యారేళ్లు గడిచాయి.
ఆమె జీవితం ఆద్యంతం ఓ సాహసోపేతమైన గాథ. ఉక్కుమహిళగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇందిర జవహర్‌లాల్‌ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగెపెట్టినా.. తదనంతర చరిత్రకు తానే సృష్టికర్త అయ్యారు. సస్య విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్‌ పరిరక్షణ, పోఖ్రాన్‌ అణు పరీక్ష, గరీబ్‌ హఠావో, ఎమర్జెన్సీ.. ఇలా ఇందిరా తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం.. ఓ చరిత్రాత్మక ఘట్టమే! నేడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్థికమాంద్యాన్ని భారతదేశం తట్టుకొని నిలబడిందంటే..
నాడు బ్యాంకులను జాతీయకరణ చేసిన ఇందిరగాంధీ ముందుచూపే. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి ఇందిరాగాంధీ అందించిన నైతిక, సైనిక, ఆర్థిక, రాజకీయ మద్ధతు మనదేశాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఓ బలమైన శక్తిగా నిలిపిందంటే అతిశయోక్తికాదు. అగ్రరాజ్యాన్ని సైతం ఎదరించిన ఇందిర రాజకీయ శక్తికి బంగ్లాదేశ్‌ యుద్ధం ఓ సజీవ ఉదాహరణ! బ్యాంకుల జాతీయీకరణ, గరీబ్‌ హఠావో నినాదాలతో వామపక్షాలకు ఎదురులేని దెబ్బ కొట్టిన ఇందిర.. ఎమర్జెన్సీ, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌తో అపప్రధను మూటగట్టుకొన్నారు.
తండ్రి జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రభావం, స్వాతంత్ర్యద్యోమ అగ్ని కీలల్లో రాటుదేలిన అనుభవం ఇందిరా వ్యక్తిత్వం.భర్త ఫిరోజ్‌ గాంధీ హఠాన్మరణంతో కుంగిపోకుండా, ధీశాలిగా ఇద్దరు కుమారులు రాజీవ్‌, సంజయ్‌లను పెంచిన ఇందిర.. బిజీ పొలిటికల్‌ షెడ్యూల్డ్‌లోనూ తన కుటుంబానికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజీవ్‌ విదేశీ వనితను పెళ్ళాడినా పెద్దమనసుతో స్వాగతించిన తల్లామె. చివర వరకు అండగా ఉంటాడని భావించిన సంజయ్‌ను విమాన ప్రమాదం కబళించినా.. కుంగిపోకుండా..
దేశం కోసం సర్వశక్తులు కూడదీసుకొని 1980లో ఆఖరిసారిగా ప్రధాని పీఠం అధిరోహించారు.ఇందిర మరణం తరువాత.. రాజకీయాలకు దూరంగా ఉన్న రాజీవ్‌ గాంధీని.. దేశసేవ కోసం పురిగొల్పింది తల్లి మరణమే! నిర్భీతితో, నిశ్చలతతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా చిట్టచివరి క్షణం వరకు పోరాడిన ఇందిరా ప్రియదర్శిని మహిళాశక్తికి మారురూపు. అందుకే.. ఇందిర‌మ్మా.. నీకు జోహార్లు..!!
source:tv5news.in

గాలికి మ‌ళ్లీ ఎదురుగాలే..!

ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్ ను నవంబర్ 14వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నేటితో వారి రిమాండ్ గడువు ముగియటంతో కేసు విచారణలో ఉన్నందున మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దాంతో న్యాయస్థానం రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా భద్రతా కారణాల రీత్యా గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను చంచలగూడ జైలులో వీడియో కాన్పరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ జరిపింది.

ఆ ముగ్గురూ మూర్ఖులేనా..?

తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు మూర్ఖులంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సొంత బలం లేక, తిరిగి ఎన్నికల్లో గెలవలేమని భయంతోనే వారు టీఆర్ఎస్ లో చేరానని ఆయన సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. మరికొంతమంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయన్నారు. టీఆర్ ఎస్ లో చేరేవరకూ బాగానే ఉంటుందని, చేరిన తర్వాత వారి స్థానం గేటు బయటేనని తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు.

28, అక్టోబర్ 2011, శుక్రవారం

షూటింగ్‌లు నిలిపేసిన టాలీవుడ్‌..

దర్శక రత్న దాసరి నారాయణ రావు భార్య, సినీ నిర్మాత దాసరి పద్మ(65) శుక్రవారం ఉద‌యం 4.35 ని.ల‌కు మరణించారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడతున్న ఆమె యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మ మరణంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆమె మృతికి సంతాపంగా శనివారం మధ్యాహ్నం వరకు షూటింగులు రద్దు చేస్తున్నట్లు తెలుగు సినీ సమాఖ్య ప్రకటించింది. పద్మ మరణం తెలియడంతో సీఎం కిరణ్ దాసరి ఇంటికి చేరుకుని ఆయన్ను ఓదార్చారు. మంత్రులు దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, మోహన్ బాబు, కృష్ణ దంపతులు, జయసుధ, రోజా, కవిత, కళ్యాణ్ రామ్, అశ్వినీ దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు దాసరి నివాసానికి చేరుకుని పద్మ మృతదేహానికి నివాళులర్పించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా సినిమాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా తమిళనాడు మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. దాస‌రి ప‌ద్మ మ‌ర‌ణంతో దాస‌రి నారాయ‌ణ‌రావు ఎంతో క‌ల‌త చెందారు. త‌న భార్య అంటే దాస‌రి నారాయ‌ణ రావుకి ఎంతో అవాజ్య‌మైన మ‌మ‌కారం, తాను తీసే సినిమాల‌న్నింటికీ దాస‌రి ప‌ద్మ‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రింప‌జేసారు.

కేసీఆర్ ఆస్తుల వివ‌రాలు చెప్పాల్సిందే..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ టిడిపి నేతల మాటలయుద్ధం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మూడురోజుల నుంచి మోత్కుపల్లి,ఎర్రబెల్లి తదితరులు మాట్లాడిన తర్వాత నిన్న డైరెక్ట్ గా చంద్రబాబే కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇవాళ మరోసారి టిడిపి సీనియర్ నేతలు తుమ్మలనాగేశ్వరరావు, రేవంత్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన ఆస్తుల వివరాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. పోలవరం టెండర్ల కోసం తెలంగాణ ఉద్యమాన్నికేసీఆర్ తాకట్టుపెట్టారని, అందువల్ల టెండర్లను రద్దు చేయాలని తుమ్మలనాగేశ్వరరావు డిమాండ్ చేశారు.విచిత్రమేమిటంటే టిడిపి నేతలు కానీ,అధినేత కానీ ఇంతగా విమర్శిస్తున్నా టీఆర్ఎస్ నేతలు వినోద్,రాజేందర్ లతో మాట్లాడించారే తప్ప కేటీఆర్, హరీష్ రావులు ఆస్థాయిలో స్పందించకపోవడం, కేసీఆర్ కూడా ఈ అంశంపై మాట్లాడకపోవడంతో ఎలాంటి వ్యూహం పాటిస్తున్నారో రాజకీయవిశ్లేషకులకు సైతం అర్థం కావట్లేదు సరికదా కాస్త అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉంటుంది.

అద్వానీ యాత్ర‌లో బాంబుల క‌ల‌క‌లం..

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వాని రధయాత్ర మార్గంలో బాంబులు దొరకడం కలకలంగా మారింది.ప్రస్తుతం అద్వాని తమిళనాడులో రధయాత్ర చేస్తున్నారు. అద్వాని అవినీతికి వ్యతిరేకంగా రధయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మధురై సమీపంలోని అలంపట్టి ప్రాంతంలో రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. దీనితో రధయాత్ర ను వేరే దారిలో గుండా కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో అద్వానిపై కోయంబత్తూర్ వద్ద హత్యాయత్నం కూడా జరిగింది. అప్పుడు ఉగ్రవాదులు బాంబులు పేల్చగా పలువురు మరణించారు.అయితే అద్వాని రాక ఆలస్యం అవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.ఇప్పుడు మధురై ప్రాంతంలో బాంబులు దొరకడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.

దురుద్దేశంతోనే బాబు ప్ర‌చారం..

రాజకీయ పార్టీలు చందాలు వసూలు చేయడంలో తప్పులేదని తెలంగాణ జాగృతి సంస్థ నేత కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవిత తన తండ్రికి మద్దతుగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నదని ఆమె అన్నారు. టిడిపి అధినేత చంద్రభాబు నాయుడు పాలు అమ్మిన డబ్బుతో పార్టీని నడుపుతున్నారా అని కవిత ప్రశ్నించారు.పోలవరం టెండర్లను రద్దు చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేసిందని ఆమె గుర్తు చేశారు.ప్రజాభిమానం కోల్పోయిన చంద్రబాబు నాయుడు కెసిఆర్ ను టార్గెట్ చేసుకున్నారని ఆమె అన్నారు.కాగా తెలంగాణ ఉద్యమానికి విరామమేకాని, విరమణ లేదని కవిత స్పష్టం చేశారు.స్వామిగౌడ్ పై ఆరోపణలు కుట్రపూరితమని ఆమె విమర్శించారు.

దాస‌రి స‌తీమ‌ణి ప‌ద్మ మృతి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు దాస‌రి నారాయ‌ణ‌రావు భార్య ప‌ద్మ మృతిచెందారు. గ‌త‌కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప‌ద్మ హైద‌రాబాద్‌లోని య‌శోదా హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. దాస‌రికి ఇద్ద‌రు కుమారులు, దాస‌రి ప్ర‌భు, దాస‌రి అరుణ్‌కుమార్. త‌న భార్య మ‌ర‌ణంతో దాస‌రి నారాయ‌ణ‌రావు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయ‌న్ని ఓదార్చ‌డానికి ప‌లువురు ప్ర‌ముఖులు హాస్పిట‌ల్‌కి వెళుతున్నారు.

26, అక్టోబర్ 2011, బుధవారం

చెర్రీ, ఉపాస‌న‌ల నిశ్చితార్థం డిసెంబ‌ర్‌లో..

ఎట్ట‌కేల‌కు మెగాస్టార్ త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ‌, అపోలో గ్రూపు సంస్థ‌ల అధినేత ప్ర‌తాప‌రెడ్డి ముమ‌రాలు ఉపాస‌న‌తో నిశ్చితార్థం ఖ‌రార‌యింది. డిసెంబ‌ర్ 1వ తేదీన వీరికి నిశ్చితార్థం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ని చిరంజీవి త‌న స‌తీమ‌ణి సురేఖ‌, పుత్రుడు రాంచ‌ర‌ణ్‌తేజ‌ల‌తో వెళ్ళి క‌లిసారు. త‌న కుమారుడి నిశ్చితార్థానికి రావాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. అయితే చిరు నిశ్చితార్థం దోమ‌కొండ కోట‌లో జ‌రుగుతుంద‌ని, దాని కోసం ఆ కోట‌ని ముస్తాబు చేస్తున్నారు.. ఇందుకోసం దాదాపు 4 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ వ‌చ్చాయి.. కానీ.. చిరు నిశ్చితార్థం ఎక్క‌డ జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే మిగిలింది.

పాపం.. ఆ న‌లుగురు..!ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా దీపావ‌ళి పండుగ‌ని దేశం యావ‌త్తూ జ‌రుపుకున్నారు.. కానీ.. పాపం.. ఆ న‌లుగురు నాయ‌కులు మాత్రం.. ఆత్మీయుల‌కి, ఆప్తుల‌కి దూరంలో, ఖైదీల మ‌ధ్య దీపావ‌ళి పండుగ‌ని జ‌రుపుకున్నారు. ఇంత‌కీ వారు ఎవ‌ర‌నే క‌దా.. యడ్యూరప్ప, ఏ.రాజా, కనిమొళి, గాలి జనార్థన్‌రెడ్డి. వీళ్లంతా పేరు మోసిన రాజకీయ నేతలు. ఆయా రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరు సీఎంగా పనిచేసిన వ్యక్తైతే మరొకరు మాజీ సీఎం ముద్దుల కుమార్తె. ఇంకొకరు కేంద్రమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టారు. మరొకరు రాష్ట్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది.
టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో చిక్కుకొని కేంద్రమాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి విలవిలలాడుతున్నారు. లేటెస్ట్‌గా కనిమొళి బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు కరుణ గారాల పట్టికి బెయిల్‌ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వచ్చేనెల 3న నిర్ణయించనుంది. దీంతో కనిమొళి కూడా కటకటాల వెనుకే కలర్‌ఫుల్‌ దివాళీ జరుపుకోనున్నారు.
టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఏ.రాజా కూడా తీహార్‌ జైలులో మగ్గుతున్నారు. పైగా ఇటీవలె ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రాజా వారి స్థానం కూడా కేరాఫ్‌ తీహార్‌ జైలే. కర్ణాటక రాజకీయాల్ని శాసించి..ఓ వెలుగు వెలిగిన గాలి జనార్థన్‌రెడ్డి కూడా దీపావళిని జైలు గోడల మధ్యే జరుపుకోనున్నారు.
అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణలో ఉక్కిరిబిక్కిరైన గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి సాదా సీదాగా దీపావళిని జరుపుకునేందుకు అన్ని విధాలా సిద్దమయ్యారు. భూముల కుంభకోణంలో చిక్కుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైల్లోనే దీపావళి జరుపుకోనున్నారు. బెంగళూరు శివార్లలోని ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకే కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులో ఇరుకున్న యడ్డీ, ఆ ఆరోపణలతోనే పదవి పోగొట్టుకోవడంతోపాటు జైలు పక్షిగా మిగిలారు. లేటెస్ట్‌గా హైకోర్ట్‌లోనూ యడ్డీకి బెయిల్‌ విషయంలో చుక్కెదురైంది. అందుకే దీపావ‌ళి పండుగ‌ని జైల్లోనే జ‌రుపుకోవాల్సి వ‌చ్చింది.
త‌మ చేత‌ల‌తో దేశాన్ని శాసించ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన ఈ న‌లుగురు నాయ‌కులు అన్యాయంగా వ‌చ్చే అధికారాన్ని, ధ‌నాన్ని ఆశించి చివ‌రికి ఇలా జైలు ప‌క్షిలుగా మారి పోయారు.. పాపం.. ఆ న‌లుగురు..!

ఎమ్మెల్యేల‌కే టోపీ పెట్టిన ఘ‌నుడు

ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కి టోపీ పెడ‌తార‌న్న భావ‌న ఉంది. కానీ.. ప్ర‌జానాయ‌కులు సాక్షాత్తూ శాస‌న‌స‌భ్యుల‌కే కుచ్చుటోపీ పెట్టి ల‌క్ష‌ల రూపాయ‌లు నొక్కేసిన ఘ‌నుడు కూడా ఉన్నాడంటే.. అంద‌రూ నోరెళ్ళ‌బెట్టారు. కోటేశ్వర రావు అనే ఆ మోసగాడు రాజీవ్ యువకిరణాలు పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పది మంది శాసనసభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన శానససభ్యులు అతని చేతిలో మోసపోయారు. తాను రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టు డైరెక్టర్‌నని, జిల్లా మంత్రులు సిఫార్సుతో తాను ఉద్యోగాలు ఇప్పించడానికి ముందుకు వచ్చానని చెప్పి ఎమ్మెల్యేల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో ఎమ్మెల్యే నుంచి అతను 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేశాడు.
నర్సాపురం శాసనసభ్యుడు ప్రసాద రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటేశ్వర రావు మోసం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రసాద రాజు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత ఓ మహిళను పట్టుకున్నారు. ఆమె ద్వారా కోటేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. తాను వసూలు చేసిన డబ్బును కోటేశ్వర రావు ఆ మహిళ ఖాతాలోనే జమ చేశాడు. కోటేశ్వరరావు అసలు పేరు తోట బాలాజీ. అతను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వాసి.

దీపావ‌ళి సంబ‌రాల‌లో అప‌శృతులు..

దీపావళి కారణమా , మరే కారణమో తెలియదుకాని రాష్ట్రంలోని పలు చోట్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.హైదరాబాద్ లోని అంబర్ పేట వద్ద ఒక వాణిజ్య సముదాయంలోను , మాదాపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ‌డంతో  అగ్నిమాపక సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ని ఆర్పారు. అలాగే విజయవాడ సామరంగం చౌక్ వద్ద కూడా ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి వద్ద ఒక భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.

స‌.జ‌.స‌మ్మె విర‌మ‌ణ క్రెడిట్ ఎవ‌రిది..?

సకల జనుల సమ్మె విరమణ క్రెడిట్ ను తీసుకోవడానికి ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహజంగానే తను వ్యూహాత్మకంగా వ్యవహరించి సమ్మె శాంతియుతంగా పరిష్కారం కావడానికి కృషి చేశానని అధిష్టానం వద్ద వివరించారు. ముఖ్యంగా ఆర్టీసి సమ్మె విరమింప చేయడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో మిగిలిన సంఘాలు దారిలోకి వచ్చాయని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సమ్మె విరమణలో తమ పాత్ర చాలా ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి దానం నాగేందర్ లు కూడా పార్టీ హై కమాండ్ వద్ద క్లెయిమ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్టీసి సమ్మెను పరిష్కరించడానికి తాను ప్రధాన కారకుడనైతే, ప్రచారం మాత్రం వేరే వారికి వెళుతోందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే సహజంగానే ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కే క్రెడిట్ దక్కుతుందని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తుండగా, అందులో తమకూ వాటా ఉందని మంత్రులు కొందరు చెబుతున్నారు.ఇక్కడ ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేంద్ర మంత్రి , రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ ను మంత్రి దానం నాగేందర్ కలిసి ఒక ప్రతిపాదన చేశారని, అజాద్ కనుక ఉద్యోగ సంఘాల నేతలను కలవడానికి ఒప్పుకుంటే సమ్మె విరమణ తేలికగా జరిగిపోతుందని చెప్పారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందుకు అజాద్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానికి అంగీకరించలేదు. అలా అయితే కొత్త సమస్యలు వస్తాయిన చెప్పి అజాద్ తో ఒక ప్రకటన వచ్చేలా చూశారు. ఆ రకంగా దానం నాగేందర్ ప్రతిపాదనకు చెక్ చెప్పి క్రెడిట్ అటు వెళ్లకుండా చూశారని అంటున్నారు. అయితే అసలు విషయం ఉద్యోగ, కార్మిక సంఘాలు అలిసిపోయి సమ్మె విరమించాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

దీపావ‌ళి ప్రాముఖ్య‌త‌

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. పిండి వంటలతో, భారతీయ సంప్రాదాయ రీతిలో జరుపుకునే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చీకటిని పారద్రోలేందుకు ప్రతీ ఇంటిని దీపాలతో అలంకరించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా బాణాసంచా పేల్చి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి రోజు దీపం వెలిగించని ఇళ్లు ఉండదంటే దీపానికి ఉన్న ప్రత్యేకత స్పష్టమవుతుంది. భారతీయ సంసృ్కతిలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపము జ్ఞానానికి సంకేతం. దేవాలయాల్లో కాకుండా ఇళ్ళలో కూడా దీపాలను వెలిగించడం శుభసూచికంగా చెబుతారు. చీకటిని పారద్రోలి వెలుగునింపే దీపావళి తమ బ్రతుకుల్లో కూడా సుఖశాంతులు నింపాలని లక్ష్మీదేవి పూజల్ని జరుపుకుంటారు. ప్రతీ వ్యాపారసంస్థలు లక్ష్మీ పూజలను దీపావళి రోజే ఘనంగా జరుపుకొని లక్ష్మీదేవి తమ వ్యాపారాల్లో అభివృద్ధిపరచాలని పూజలు చేస్తారు.

దీపావళి ప్రాముఖ్యత

దీపావళి పండుగ వెనుక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నరకాసురిని సత్యభామ వధించడమే ప్రాచుర్యం పొందింది. నరకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ద్వారా వరాన్ని కోరుతాడు. ఆ గర్వంలో అనేక అకృత్యాలకు పాల్పడుతుంటాడు. ఇంద్రున్ని ఓడించి సింహసనాన్ని అధిష్టిష్తాడు. అంతటితొ ఆగకుండా అనేక వేలామంది కన్యలను చెడిపివేస్తాడు. రోజురోజుకి నరకాసురిడి ఆగడాలు పెరిగిపోవడంతో భరించలేని సత్యభామ నరకాసురిడిన సంహరించేందుకు శ్రీకృష్ణుని అవకాశం కల్పించాలని వేడుకుంటుంది. సత్యభామ కోరికను మన్నించడంతో పాటు రథానికి సారథిగా ఉండటానికి అంగీకరిస్తాడు. కొద్దిరోజుల పాటు సత్యభామ యుద్దం చేసి చతుర్ధశి రోజున నరకాసురిడిన సంహరిస్తుంది. నరకాసురిడిని వధతో ప్రజలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. అదే రోజును దీపావళిగా జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేవారని పురాణాలు చెబుతుంటారు.

లక్ష్మీపూజ

దీపావళి రోజున లక్ష్మీపూజలు చేయడం ప్రధానాంశం. లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి కథ ఒకటి పురాణాల్లో ఉంది. దుర్వాస మహా మునికి లోకసంచారంలో విద్యదరి తారసపడుతుంటుంది. ఆమె చేతిలో ఉన్న పూలదండ తనకు కావాలని దుర్వాసనుడు విద్యదరిని అడుగుతాడు. వెంటనే దుర్వాసునికి పూలదండ ఇచ్చేస్తుంది. దుర్వాసనుడు అ పూలదండను ఇంద్రునికి బహుమానంగా అందజేస్తాడు. పూలదండ తీసుకునే సమయంలో ఇంద్రుడు వేరే ఆలోచనలో ఉండటంతో పూలదండను ఎనుగుపైకి విసిరేస్తాడు. దండలోని పూల సువాసనకు పర్వసించిన ఏనుగు(ఏనుగు పేరు హైరవత ం) దండను కాళ్లతో తొక్కి పాడుచేస్తుంది.
ఆ విషయాన్ని చూసిన దుర్వాసనుడు ఆగ్రహంతో ఇంద్రున్ని శపిస్తాడు. శాపఫలితంగా ఇంద్రుడు అసురులతో(రాక్షసులు) జరిపిన యుద్దంలో ఓడిపోతాడు. రాజ్యాన్ని కోల్పోయి ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి నీ బాధను వెలగక్కాలని ఇంద్రుడికి బ్రహ్మదేవుడు సూచిస్తాడు. తన కష్టాల్ని గట్టేక్కించాలని విష్ణువును ఇంద్రుడు కోరగా పాలసముద్రం కుమార్తెగా జన్మించి దేవతలకు ఆశీస్సులు ఇవ్వాలని లక్ష్మీదేవీని విష్ణువు ఆదేశిస్తాడు. దీంతో విష్ణువు ఆదేశానుసారం లక్ష్మీదేవి జన్మించడంతో క్షీరసాగరం పద్మల దండను లక్ష్మీదేవీకి కానుకగా ఇస్తాడు. లక్ష్మీదేవి దండను విష్ణువు తన వక్షస్థలంపై ఉంచుకుంటాడు. దీంతో ఇంద్రుడి శాపవిముక్తి కలిగి యధావిధిగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఆ నాటి నుండి ధర్మబద్దమైన సంపాదన చేపట్టాలని అదే లక్ష్మీగా కొలుస్తుంటారు.

దీపావ‌ళి వెలుగుని పంచిన స్టాక్‌మార్కెట్‌స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలను ఆర్జించడంతో ‘విక్రమ’ శకం (2067) ఉత్సాహంగా ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించిన మధ్యంతర ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు పావుశాతం పెంచినా మార్కెట్ ప్రతికూలంగా స్పందించకుండా ముంబయి స్టాక్ మార్కెట్ సె న్సెక్స్ 316 పాయింట్లు లాభపడింది. సోమవారం లాభపడిన సెనె్సక్స్ మంగళవారం కూడా 315.58 పాయింట్లు పెరగడంతో 17,254.86 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ కూడా 93.25 పాయింట్లు లాభపడి 5,191.60 వద్ద ముగిసింది. పెట్టుబడిదారులు అక్టోబర్ నెల సెటిల్‌మెంట్లు క్లియర్ చేసుకుని బుధవారం దీపావళి పండుగ సందర్భంగా 90 నిమిషాల పాటు జరిగే ‘మూరత్’ ట్రేడింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత ‘2068’ కొత్త శకానికి శ్రీకారం చుట్టనున్నారు.
రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో వరుసగా 13వసారి (మార్చి 2010 నుంచి) వడ్డీరేట్లను పావుశాతం పెంచింది. వడ్డీరేట్లు పెంపు ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై ఉండవచ్చునన్న భయాలకు తోడు సేవింగ్స్‌రేట్లపై నియంత్రణ తొలగించడంతో లాభాలు దెబ్బతినవచ్చునన్న అంచనాలు బ్యాంకింగ్ షేర్లను నష్టాల్లోకి నెట్టాయి.
హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ షేర్లు 3 శాతం వంతున క్షీణించగా, ఐసిఐసిఐ బ్యాంక్ 1 శాతం పెరిగింది. ఐటి కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఐటి ఇండెక్స్ 2.66 శాతం లాభపడింది. ఆటో ఇండెక్స్ 2.95 శాతం పెరిగింది. ఈ పండుగ సీజన్‌లో ఆటోరంగ అమ్మకాలు పెరిగి లాభాలు గడిస్తాయన్న ఆశ ఇందుకు కారణంగా విశే్లషకులు భావిస్తున్నారు. మహీంద్ర అండ్ మహీంద్ర 5 శాతం లాభపడగా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, స్టెరిలైట్, బజాజ్ ఆటో 4 శాతం వంతున పెరిగాయి. రిలయన్స్ 3.4 శాతం, లార్సన్ అండ్ టుబ్రో 3.2 శాతం పెరిగింది. ఎన్‌టిపిసి మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆ కంపెనీ నికరలాభం 15 శాతం పెరిగి 2,424 కోట్ల రూపాయలు సాధించింది. ఈ కంపెనీ స్టాక్ 1.4 శాతం వృద్ధి చెందింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం ‘మూరత్’ ట్రేడింగ్ కొనసాగుతుంది. గురువారం దీపావళి సందర్భంగా మార్కెట్లకు సెలవు.

ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బారు హాలులో గవర్నర్ దంపతులు బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక పుర ప్రముఖులను కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుతారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజలకు సర్వసుఖాలు, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించాలని, అందరిలో ఐక్యమత్యాన్ని పెంపొందించి రాష్ట్ర పురోభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసేలా ప్రేరణ కలుగ జేయాలని బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా దీపావళి పండుగ ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

దీపావ‌ళి పండుగ సామాన్యుడికి దూరం..?

 వెలుగుల‌ని ప్రసాదిస్తూ వ‌చ్చింది దీపావ‌ళి.. కానీ.. సామాన్యుడికి మాత్రం ఈ దీపావ‌ళి పండుగ ఆమ‌డ దూరంలోనే ఉంది. అధిక ధ‌ర‌లు స‌మాన్యులు పండుగ చేసుకునే వీలు లేకుండా చేస్తున్నాయి. నిత్యావ‌స‌ర వ‌స్తువులు ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌డంతో దీపావ‌ళిని జ‌రుపుకోవ‌డ‌మే కాదు.. త‌మ కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అన్న ఆలోచ‌న‌ల‌తోనే సామాన్యుడు స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దీపావ‌ళి పండుగ అన‌గానే ట‌పాసుల శ‌బ్దాలు, మ‌తాబుల వెలుగులు, చిన్న‌పిల్ల‌ల చేతుల్లో అందంగా నాట్యం చేసే కాక‌ర పువ్వొత్తుల క‌మ‌నీయ దృశ్యాలు.. ఇవ‌న్నింటికీ సామాన్యుడు దూర‌మ‌యిపోతున్నాడు. ట‌పాసుల కాల్చ‌డం ద్వారానే దీపావ‌ళి పండుగ‌ని ప‌రిపూర్ణంగా జ‌రుపుకున్నామ‌న్న ఆనందాన్ని మ‌నం పొంద‌గ‌లం.. కానీ.. ట‌పాసులు కొన‌డానికి వెళితే.. వాటి ధ‌ర‌లు చూడ‌గానే ట‌పాసులు పేల్చ‌కుండానే గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. ఈ పాల‌కుల నిర్ల‌క్ష్య ధోర‌ణితో, సామాన్యుడి న‌డ్డివిరిచేలా అడ్డ‌దిడ్డంగా పెంచుకుంటూ పోతున్న ధ‌ర‌ల‌ని అదుపులోకి తీసుకువ‌స్తేనే అస‌లైన దీపావ‌ళి పండుగ‌ని సామాన్యుడు చేసుకుంటాడన్న‌ది నిజం..

భార‌త క్రికెట్ అభిమానుల‌కి దీపావ‌ళి కానుక‌

భార‌త‌క్రికెట్ అభిమానుల‌కి ఒక రోజు ముందుగానే దీపావ‌ళి వ‌చ్చింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదు వండేలనీ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ని సొంతం చేసుకుంది. దీనితో ఇంగ్లండ్‌పై క‌సి తీర్చుకోవ‌డ‌మే కాకుండా కోట్లాది మంది భార‌త క్రికెట్ అభిమానుల‌కి దీపావ‌ళి కానుక‌గా ఈ విజ‌యాన్ని ధోని సేన స‌గ‌ర్వంగా స‌మ‌ర్పించింది..
ఊహించినట్టే ఇండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ 176 పరుగులకే ఆల్ ఔట్ కావడంతో ఇండియాకు ఘనవిజయం లభించింది. 95 పరుగుల తేడాతో ఇండియా ఐదవ ఔన్ డే గెల్చుకుని సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. తొలుత ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేయగా, ఇంగ్లండ్ అందుకు మొదట అద్భుతమైన సమాధానం చెప్పింది. 129 పరుగులవరకు ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా బ్రహ్మాండంగా ఆడిందని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసించారు.
కుక్ 60 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు ప్రారంభమయ్యాయి. మరి ఐదు పరుగులకు క్రేగ్‌ను జడేజా ఎల్.బి.డబ్ల్యు ద్వారా ఔట్ చేయడంతో కలకత్తాలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. అప్పటికి క్రేగ్ 64 బంతులలో 63 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వికెట్లు టపటప పడిపోయాయి. కెప్టెన్ ధోని 75 పరుగులతో ఇండియా గెలుపునకు మార్గం సుగమం చేస్తే, జడేజా నాలుగు వికెట్లు తీసి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు.
ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయేవరకూ ఈ మ్యాచ్‌లో మాత్రం విజేత ఇంగ్లండేనని అందరూ భావించారు. అయితే 129 పరుగుల వద్ద మొదటి వికెట్, 134 పరుగుల వద్ద రెండవ వికెట్, 137 పరుగుల వద్ద మూడు, నాలుగు వికెట్లు పడిపోవడంతో ఇండియా విజయం తథ్యమైపోయింది. 141 పరుగుల వద్ద 5 వికెట్ పడిపోగా, 176 పరుగులకు ఆల్ ఔట్ అయ్యారు.

దీపావ‌ళి ప‌ర్వదినాన్ని ఇలా జ‌రుపుకోవాలి

దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి… దైవ మూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.