రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా లేదు..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడలేదని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యాఖ్యానించారు. ఇంతవరకు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందలేదని గవర్నర్ అన్నారు. తెలంగాణ లో శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందంటే తాను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం బలపరీక్ష చేసుకోవలసిన అవసరం లేదని కూడా ఆయన స్సష్టం చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి సబా విశ్వాసం పొందాలని ఏ కారణంతో అడగాలని కూడా నరసింహన్ ప్రశ్నించారు. మొత్తం మీద గవర్నర్ ప్రస్తుతానికి ప్రభుత్వం మైనార్టీలో పడలేదని చెప్పడం ద్వారా ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను గవర్నర్ కొట్టి పారేశారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఈ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టాలని డిమాండు చేస్తున్న నేపధ్యంలో గవర్నర్ ఈ విషయాన్ని తేల్చివేసినట్లయింది. అయితే ఇప్పుడు గవర్నర్ ను కలిసి ఎవరైనా విశ్వాస పరీక్ష కోరితే తప్ప కిరణ్ సర్కార్ కు మరికొంతకాలం పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!