పోచారం విజ‌యం..సెంటిమెంటుకే ప‌ట్టం..


నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలో ముందుగా ఊహించినట్లే ప్రజలు సెంటిమెంట్ కే పట్టం కట్టారు. బాన్సువాడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్‌పై 49,889 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే పోచారం స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఉప ఎన్నికల్లో మొత్తం 1,22,872 ఓట్లు పోల్ అవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 83,245 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 33,354 ఓట్లు పోలయ్యాయి. పోచారం విజయంతో టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక ్తపరుస్తున్నారు. గతంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడే విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో బాన్సువాడలో ఎన్నిక అనివార్యమైంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాత్రమే పోటీపడ్డాయి. ఉప ఎన్నికకు టీడీపీ పార్టీ దూరంగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!