దీపావ‌ళి ప్రాముఖ్య‌త‌


హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. పిండి వంటలతో, భారతీయ సంప్రాదాయ రీతిలో జరుపుకునే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చీకటిని పారద్రోలేందుకు ప్రతీ ఇంటిని దీపాలతో అలంకరించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా బాణాసంచా పేల్చి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి రోజు దీపం వెలిగించని ఇళ్లు ఉండదంటే దీపానికి ఉన్న ప్రత్యేకత స్పష్టమవుతుంది. భారతీయ సంసృ్కతిలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపము జ్ఞానానికి సంకేతం. దేవాలయాల్లో కాకుండా ఇళ్ళలో కూడా దీపాలను వెలిగించడం శుభసూచికంగా చెబుతారు. చీకటిని పారద్రోలి వెలుగునింపే దీపావళి తమ బ్రతుకుల్లో కూడా సుఖశాంతులు నింపాలని లక్ష్మీదేవి పూజల్ని జరుపుకుంటారు. ప్రతీ వ్యాపారసంస్థలు లక్ష్మీ పూజలను దీపావళి రోజే ఘనంగా జరుపుకొని లక్ష్మీదేవి తమ వ్యాపారాల్లో అభివృద్ధిపరచాలని పూజలు చేస్తారు.

దీపావళి ప్రాముఖ్యత

దీపావళి పండుగ వెనుక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నరకాసురిని సత్యభామ వధించడమే ప్రాచుర్యం పొందింది. నరకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ద్వారా వరాన్ని కోరుతాడు. ఆ గర్వంలో అనేక అకృత్యాలకు పాల్పడుతుంటాడు. ఇంద్రున్ని ఓడించి సింహసనాన్ని అధిష్టిష్తాడు. అంతటితొ ఆగకుండా అనేక వేలామంది కన్యలను చెడిపివేస్తాడు. రోజురోజుకి నరకాసురిడి ఆగడాలు పెరిగిపోవడంతో భరించలేని సత్యభామ నరకాసురిడిన సంహరించేందుకు శ్రీకృష్ణుని అవకాశం కల్పించాలని వేడుకుంటుంది. సత్యభామ కోరికను మన్నించడంతో పాటు రథానికి సారథిగా ఉండటానికి అంగీకరిస్తాడు. కొద్దిరోజుల పాటు సత్యభామ యుద్దం చేసి చతుర్ధశి రోజున నరకాసురిడిన సంహరిస్తుంది. నరకాసురిడిని వధతో ప్రజలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. అదే రోజును దీపావళిగా జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేవారని పురాణాలు చెబుతుంటారు.

లక్ష్మీపూజ

దీపావళి రోజున లక్ష్మీపూజలు చేయడం ప్రధానాంశం. లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి కథ ఒకటి పురాణాల్లో ఉంది. దుర్వాస మహా మునికి లోకసంచారంలో విద్యదరి తారసపడుతుంటుంది. ఆమె చేతిలో ఉన్న పూలదండ తనకు కావాలని దుర్వాసనుడు విద్యదరిని అడుగుతాడు. వెంటనే దుర్వాసునికి పూలదండ ఇచ్చేస్తుంది. దుర్వాసనుడు అ పూలదండను ఇంద్రునికి బహుమానంగా అందజేస్తాడు. పూలదండ తీసుకునే సమయంలో ఇంద్రుడు వేరే ఆలోచనలో ఉండటంతో పూలదండను ఎనుగుపైకి విసిరేస్తాడు. దండలోని పూల సువాసనకు పర్వసించిన ఏనుగు(ఏనుగు పేరు హైరవత ం) దండను కాళ్లతో తొక్కి పాడుచేస్తుంది.
ఆ విషయాన్ని చూసిన దుర్వాసనుడు ఆగ్రహంతో ఇంద్రున్ని శపిస్తాడు. శాపఫలితంగా ఇంద్రుడు అసురులతో(రాక్షసులు) జరిపిన యుద్దంలో ఓడిపోతాడు. రాజ్యాన్ని కోల్పోయి ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి నీ బాధను వెలగక్కాలని ఇంద్రుడికి బ్రహ్మదేవుడు సూచిస్తాడు. తన కష్టాల్ని గట్టేక్కించాలని విష్ణువును ఇంద్రుడు కోరగా పాలసముద్రం కుమార్తెగా జన్మించి దేవతలకు ఆశీస్సులు ఇవ్వాలని లక్ష్మీదేవీని విష్ణువు ఆదేశిస్తాడు. దీంతో విష్ణువు ఆదేశానుసారం లక్ష్మీదేవి జన్మించడంతో క్షీరసాగరం పద్మల దండను లక్ష్మీదేవీకి కానుకగా ఇస్తాడు. లక్ష్మీదేవి దండను విష్ణువు తన వక్షస్థలంపై ఉంచుకుంటాడు. దీంతో ఇంద్రుడి శాపవిముక్తి కలిగి యధావిధిగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఆ నాటి నుండి ధర్మబద్దమైన సంపాదన చేపట్టాలని అదే లక్ష్మీగా కొలుస్తుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!