ఎమ్మెల్యేగా పోచారం రాజీనామా చేస్తారా..?


నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి విచిత్రమైన పరిస్థితిలో పడ్డారు.ఆయన ఉప ఎన్నికలో గెలచి ప్రమాణం చేస్తుండగా, మరో వైపు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఉన్నారు.ఈ సమయంలో ఒక చేత ప్రమాణం,మరో చేత రాజీనామా పత్రం అన్న చందంగా ఉంది. అయితే ఇప్పటికే రాజీనామా చేసిన టిడిపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎటూ తేల్చలేదు కాని ఇప్పుడు ఈయన రాజీనామా చేసినా అదే పరిస్థితి ఉంటుంది.తెలంగాణ సాధనలో భాగంగా అంతవరకు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ తరపున గెలుపొందారు.కాగా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయకుండా నిరసన తెలపాలని టిడిపి నేత , మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.లేకుంటే కేవలం జీతం కోసం ఎమ్మెల్యే గా ప్రమాణం చేసినట్లవుతుందని ఆయన విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!