గాలికి మ‌ళ్లీ ఎదురుగాలే..!


అక్రమమైనింగ్ కేసులో అరెస్టైన  గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఈనెల 31వ తేదీ వరకూ రిమాండ్ పొడిగించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు సోమవారం విచారణ జరిపింది. కాగా తెలంగాణ బంద్ కు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ ప్రాంత న్యాయవాదులు, సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఒకప్పుడు ప‌ట్టింద‌ల్లా బంగారం అయ్యి.. గాలి జ‌నార్థన్‌రెడ్డిని గాల్లో మేడ‌లు క‌ట్టే స్థాయిల్లో భూమిపైన మేడ‌లు క‌ట్టుకునే స్థాయికి తీసుకువ‌చ్చింది. కానీ ప్రస్తుతం గాలికి ఎదురుగాలి వీస్తోంది.. తాను బంగారాన్ని ప‌ట్టుకున్నా అది కాస్తా భ‌స్మం అయిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. కాక‌పోతే ఒక‌ప్పుడు బంగారు కుర్చీలో కూర్చున్న గాలి ఇప్పుడు చిప్పకూడు తిన‌డం ఎంత విచిత్రం. ల‌క్షల కోట్లు క‌లిగిన గాలి త‌న‌కి ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బ‌హుషా క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు. కానీ.. టైం బ్యాడ్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!