జూపల్లి రాజీనామా
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లె కృష్ణారావు మళ్లీ శాసనసభకు రాజీనామా చేశారు. తెలంగాణ సాధనకోసం ఆయన రెండో సారి రాజీనామా చేశారు. గతంలో జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భంలో మరో మంత్రి అరుణతో వచ్చిన వివాదంలో ఆయన పదవిని వదలుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసినా స్పీకర్ తోసిపుచ్చారు. అయితే ఇటీవలికాలంలో తెలంగాణ అంశంపై ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెబుతున్నారు. కాగా శుక్రవారం నాడు తన రాజీనామా పత్రాన్ని ఆయన శాసనసభ కార్యదర్శి సదానంద్ కు అందచేశారు. అయితే ఇప్పటికే పలువురి రాజీనామాలు పెండింగులో ఉన్నందున దీని పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండకపోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి