గృహనిర్బంధంలో కొత్తగూడెం ఎమ్మెల్యే..
తెలంగాణ సాధన కోసం కొత్తగూడెం సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మొదలు పెట్టిన ఆమరణ దీక్ష ను ముందుగానే పోలీసులు భగ్నం చేశారు.అనుమతి లేదని చెప్పి ఆయనను అరెస్టు చేసి ఆయన ఇంటివద్దకు తీసుకువెళ్లారు. దానిపై సిపిఐ కార్యకర్తలు, జెఎసి నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరాహార దీక్ష చేయతలపెట్టిన సాంబశివరావు ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని నేతలు విమర్శించారు. కాగా తాను ఇంటి నుంచే దీక్ష చేపడతానని సాంబశివరావు ప్రకటించారు.ప్రస్తుతం ఆయన గృహనిర్భంధం లో ఉన్నారు. సిపిఐ కార్యకర్తలను కూడా లోనికి అనుమతించడం లేదు. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లాలో మూడురోజులపాటు నిరసనలు చేపట్టాలని సిపిఐ జిల్లా శాఖ నిర్ణయించింది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి