124 రైళ్ళని రద్దు చేసిన ద.మ.రైల్వే..
సాక్షాత్తు రాష్ట్ర DGPయే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా… రైలు రోకోతో రిస్క్ తీసుకునేందుకు ఆ శాఖ ఇష్టపడటం లేదు. దీంతో రేపటి నుంచి జరపతలపెట్టిన రైలురోకో సందర్భంగా 124 రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా కేంద్ర పోలీస్ బలగాలతో పాటు సివిల్ పోలీసు సేవలను వినియోగిస్తున్నారు.
ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు రైల్ రోకో జరుగుతుండడంతో దక్షిణ మద్య రైల్వే ముందు జాగ్రత్తగా 48 ఎక్స్ ప్రెస్,76 పాసింజర్ రైళ్ళను రద్దుచేసింది. 54 రైళ్ళు పాక్షికంగా రద్దు కాగా మరో 68 రైళ్ళను దారి మళ్ళించారు.19 ఎక్స్ ప్రెస్ రైళ్ళను రీ షెడ్యూల్ చేసిన దక్షిణ మద్య రైల్వే 16 పాసింజర్ రైళ్ళను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇవిగాక సికింద్రాబాద్ -లింగంపల్లి మధ్య MMTS రైళ్లతోపాటు, తెలంగాణా వ్యాప్తంగా తిరిగే DHMU రైళ్ళను పూర్తిగా మూడు రోజుల పాటు కేన్సిల్ చేసింది. రైల్ రోకోలు చేస్తామని జె ఎసి ప్రకటించినా రైళ్ళను పోలీస్ రక్షణతో యధాతధంగా నడుపుతామని అటు పోలీసులు …. ఇటు రైల్వే జిఎం ప్రకటించారు. రైళ్ళను అడ్డుకున్నా…. రైల్ రోకోలు చేసినా నాన్ బెయిలబుల్ కేసులు… జైలు శిక్షలు తప్పవని సాక్షాత్తు డిజిపి దినేష్‌రెడ్డి ప్రకటించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి