రైల్‌రోకో షురూ..!


తెలంగాణ వ్యాప్తంగా రైల్‌రోకోల‌ను ఉద్యమ‌కారులు ప్రారంభించారు. ప‌లు ప్రాంతాల‌లో రైలు ప‌ట్టాల‌పైకి ఉద్యమ‌కారులు దూసుకువ‌స్తున్నారు. ముందు జాగ్రత్త చ‌ర్యగా ద‌క్షిణ‌మ‌ధ్యరైల్వే ప‌లు రైళ్లను ర‌ద్దు చేసింది. అయితే మిగ‌తా కొన్ని రైళ్ళ రాక‌పోక‌ల‌ని కూడా అడ్డుకునేందుకు ఉద్యమ‌కారులు సిద్దమ‌వుతున్నారు. ఆయా జిల్లాల‌లోని రాజ‌కీయ నాయ‌కులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మౌలాలిలో రైల్ రోకో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమెపై రైల్వేయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కవితను తీసుకువెళుతున్న బస్సును కుషాయిగూడ వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమెను విడుదల చేయాలంటూ బస్సు అద్దాలను ద్వంసం చేశారు. రైల్‌రోకో కార్యక్రమాన్ని అడ్డుకోవ‌డానికి, తెలంగాణ వాదుల‌ని అరెస్టు చేయ‌డానికి పోలీసులు స‌ర్వస‌న్నథ‌మ‌వుతుండ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. రైళ్ళ పై రైలు ప్రయాణీకుల‌పై, రైల్వే ఆస్తుల‌పై తెలంగాణ‌వాదులు విరుచుకుప‌డితే మాత్రం క‌ఠిన‌త‌ర‌మైన శిక్షలు అమ‌లు ప‌రుస్తామ‌ని డిజిపి ప్రక‌టించ‌డం తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!