గుజ‌రాత్ లో భూకంపం


గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతాన్ని భూకంపం కుదిపేసింది. గురువారం రాత్రి 10.48 నిమిషాలకు దాదాపు 25 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దాంతో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
సూరత్, జాంనగర్, జూనాగఢ్, రాజ్‌కోట్, భావ్‌నగర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. జూనాగఢ్ పట్టణానికి 38 కిలోమీటర్లు దక్షిణంగా.. రాజ్‌కోట్‌కు 126 కిలోమీటర్లు నైరుతి దిశలో సాసాంగిర్ పట్టణం వద్ద ఉపరితలానికి 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూతత్వ శాఖ ప్రకటించింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలేమీ తెలియరాలేదు. దేవరకొండ: దేవరకొండ డివిజన్ కృష్ణా పరివాహక ప్రాంతమయిన పెద్దఅడిశర్లపల్లి, చందంపేట, మండలాల్లోని గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి స్వల్పం భూమి కంపించింది. పెద్దఅడిశర్లపల్లి మండలం నక్కల పెంటతండా, వద్దిపట్ల, చందంపేట మండలం పెద్దమునిగల్, చిన్నమునిగల్, వైజాగ్ కాలనీ, బుగ్గతండాలలో స్వల్ప భూ ప్రకంపనలు కనిపించాయని ప్రజలు పేర్కొంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!