న‌వ‌దీప్‌పై కేసు..


మొద‌టి సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకుని, చంద‌మామ‌, ఆర్య – 2 లాంటి చిత్రాల‌తో గుర్తింపు సంప‌దించ‌కున్నహీరో న‌వ‌దీప్‌. తెలుగులో హీరోగా, సెకెండ్ హీరోగా మంచి అవ‌కాశాలు కొడుతున్న ప్పటికీ నిజ జీవితంలో మాత్రం విల‌న్ వేశాలేస్తున్నాడు. అర్థరాత్రి వేళ‌ల్లో ఫుల్లుగా మందు కొట్టి, అడ్డదిడ్డంగా  కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపై వెళుతున్న వారిని గాయాల‌పాలు చేయ‌డం లాంటివి చేసి పోలీసుల చేతికి కూడా చిక్కాడు. నోవాటెల్ హోట‌ల్‌లో ఎవ‌రితోనో గొడ‌ప‌డి, ఆ కోపాన్ని మామూలు విద్యార్థుల‌పై తీర్చుకున్న ఘ‌ట‌న‌లో పోలీసు కేసులో చిక్కాడు. రాత్రి రెండు గంట‌ల ప్రాంత‌లో  ఓ న‌లుగురు అమ్మాయిల‌ని వేసుకుని వ‌చ్చిన న‌వ‌దీప్ త‌మ‌తో గొడ‌వ ప‌డ్డాడ‌ని, త‌మ ఖ‌రీదైన సెల్‌ఫోన్లని ప‌గుల‌గొట్టాడ‌ని కొంద‌రు స్టూడెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేశారు. సినిమాల‌లో చేసే హీరోయిజంలో కొద్దోగొప్ప నిజ‌జీవితంలో కూడా పాటిస్తే హుందాగా ఉంటుంది.. కానీ ఇలా ఫుల్లుగా తాగి రోడ్లపై ప‌డితే పేరు చెడిపోవ‌డ‌మే కాకుండా అవ‌కాశాలు కూడా అదృశ్యమైపోతాయ‌ని నేటి యంగ్ హీరోలు తెలుసుకుంటే బావుంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!