ఉస్మానియాకు తాకిన రైల్‌రోకో సెగ‌


రైలురోకో సందర్భంగా ఓయూ నుంచి సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. ఆందోళనకారులు తార్నాకలో బస్సులపై దాడి చేశారు. కాగా పోలీసులపై విద్యార్దులు రాళ్లతో దాడులు చేస్తున్నారు. క్యాంపస్ విద్యార్ధులను అడ్డుకోవడం కోసం పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆయా చోట్ల రైల్ రకోను విజయవంతం చేయడానికి ఆందోళనకారులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. కాగా కొన్ని రైళ్లను నడిపిన అదికారులు మరికొన్నిటిని కూడ ఆపునరుద్దరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహాబూబాబాద్ వద్ద కూడా పోలీసులకు, ఆందోళనకారులకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఒక ఎస్.ఐ గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఫిష్ ప్లేట్లు తొలగించి రైళ్లకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించినవారు కొందరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!